సీతారామం హిట్టు.. హను రాఘవపూడితో ఆ స్టార్ దర్శకుడికీ పోలిక!

కొన్ని కొన్ని సినిమాలు వచ్చిన కాన్సెప్ట్ తోనే కొత్త కొత్తగా వస్తుంటాయి.నిజానికి వచ్చిన కాన్సెప్ట్ తో సినిమాలు వస్తే ప్రేక్షకులు చూడటానికి అంత ఇష్టపడరు.

 Seetharam Hittu Hanu Raghavapudis Comparison With That Star Director Shekhar Kam-TeluguStop.com

ఎందుకంటే ప్రేక్షకులు కథలో కొత్తదనం వెతుకుతారు.ముఖ్యంగా లవ్ స్టోరీస్ లాంటి సినిమాలు వస్తే అందులో ముద్దులు, కొన్ని నీచమైన సన్నివేశాలు ఉంటాయి.

నిజానికి దర్శకులు అలా కావాలని తీస్తూ ఉంటారు.

మామూలుగా లవ్ స్టోరీస్ అంటేనే అందులో స్టోరీ తక్కువగా రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది.

ఓ ఇద్దరి దర్శకుల సినిమాలలో అలాంటివి ఉండవు.పైగా వాళ్ళు తీసిన లవ్ స్టోరీ సినిమాలలో ఎక్కడా కూడా రొమాంటిక్ సన్నివేశాలు కనిపించవు.

ఇటీవలే విడుదలైనా సీతారామం సినిమా మంచి ప్రేమ కథతో తెరకెక్కింది.ఇక ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు.

హను రాఘవపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దర్శకుడిగానే కాకుండా రచయితగా కూడా పనిచేస్తున్నాడు.

ఈయన దర్శకత్వంలో చాలా సినిమాలు తెరకెక్కగా అవన్నీ మంచి ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Telugu Andala Rakshasi, Seetharam, Shekhar Kammula-Movie

అందులో అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, సీతారామం వంటి మంచి లవ్ స్టోరీ తో ఉన్న సినిమాలను తెరకెక్కించాడు.ఈ సినిమాలో ఆయన నటీనటుల మధ్య చూపించిన ప్రేమ అద్భుతంగా కనిపిస్తుంది.పైగా వారి మధ్యలో ఎటువంటి రొమాంటిక్ సీన్లు కూడా కనిపించవు.

అయినా కూడా సినిమాలు సూపర్ హిట్టు అందుకున్నాయి.అలా హను రాఘవ పూడియే కాకుండా మరో డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా మంచి లవ్ స్టోరీ లాంటి సినిమాలని తెరకెక్కించాడు.

ఈయన కూడా దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా , సినీ రచయితగా కూడా చేస్తున్నాడు.ఈయన దర్శకత్వంలో లవ్ నేపథ్యంలో పలు సినిమాలు విడుదల కాగా అవి ఆనంద్, గోదావరి, ఫిదా సినిమాలు.

Telugu Andala Rakshasi, Seetharam, Shekhar Kammula-Movie

ఈ సినిమాలు చాలా నాచురల్ గా కనిపించడమే కాకుండా ఇందులో నటీనటుల మధ్య కూడా మంచి ప్రేమను చూపించాడు శేఖర్ కమ్ముల.ఇక ఈ సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకోగా ఇందులో కూడా ఎక్కడ రొమాంటిక్ సన్నివేశాలు చూపించలేదు శేఖర్ కమ్ముల.అంటే మామూలుగా లావు నేపథ్యంలో వచ్చే సినిమాలు అన్ని రొమాంటిక్ తోనే వస్తాయి అని ప్రేక్షకులు అనుకుంటారు.

అలా వస్తేనే మంచి హిట్ అని అనుకుంటారు.కానీ ఈ ఇద్దరు దర్శకులు అలాంటివి కొట్టి పారేశారు.లవ్ అంటే రొమాన్స్ కాదు అని.

ఇద్దరి మధ్య ఉండే అందమైన ప్రేమ అని, అర్థం చేసుకునే ప్రేమ అని చేసి చూపించారు.కేవలం స్వచ్ఛమైన ప్రేమను చూపించారు ఈ ఇద్దరు దర్శకులు.

అలా లవ్ సినిమాలకు ఈ ఇద్దరు దర్శకులను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక ఇటీవలే హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన సీతారామం సినిమా ప్రస్తుతం థియేటర్లో బాగా సందడి చేస్తుంది.

మొత్తానికి ఈ సినిమా కూడా ప్రేక్షకుల మైండ్ నుండి బయటకు రావట్లేదు అని అర్థం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube