దళిత వాడను కాపాడండి:ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:నిత్యం కురుస్తున్న వర్షాలతో పోలాలనుండి వస్తున్న వరదతో దళిత వాడలోకి ఇండ్లన్ని వచ్చి జలమయం అవుతున్నాయని,ఇండ్లు కూలిపోయే పరిస్థితి వున్నదని ప్రభుత్వం వెంటనే స్పందించి దళిత వాడను కాపాడాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ డిమాండ్ చేశారు.సూర్యాపేట నియోజకవర్గ సమగ్రాభివృద్ధికై తెలంగాణ జనసమితి చేపట్టిన జనచైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు ఆత్మకూర్ (ఎస్) మండలం పాత సూర్యాపేట,డబ్బతండాలలో పర్యటించారు.

 Save The Dalit: Dharmarjun-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రజలు పలుస్యలు ధర్మార్జున్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లన్ని నీళ్ళతో నిండడంతో తెల్లవార్లు నీటిని తోడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని,ఈ ఇండ్లన్ని ఎప్పుడు కూలుతాయోనని భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని,వృద్దులు సైతం విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదని గ్రామస్థులు తెలిపారని అన్నారు.

ఈ సమస్యలను అధికారులకు,ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని వాపోయారు.ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి ప్రభుత్వం పేదల భూములను స్వాధీనం చేసుకున్నారని,అట్టి జాగాలో ఇళ్ళు కట్టుకుందామని పునాదులు కట్టుకున్నాక అధికారులు దౌర్జన్యంగా నిలిపివేశారన్నారు.

ఇక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉండటంతో ఇళ్ళ కోసం కెటాయించిన జాగాలో గుడిసెలు వేసుకుంటే అధికారులు వచ్చి పీకేయించారని,ఇది మంత్రిని కలిసి సమస్యను మొరపెట్టుకున్న రోజే జరగడం దిగ్ర్భాంతిని కలుగజేసిందన్నారు.అదే విధంగా గ్రామంలో ఓల్టేజితో ఫ్యాన్ లు,టీవీలు కాలిపోతున్నాయని,సమస్య పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ తాత్సారం చేస్తుండటంతో ఇంటికి 100 రూపాయల చొప్పున మేమే వేసుకుని పరిష్కారం చేసుకుందామనుకున్నామన్నారు.

ఈ సందర్భంగా స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఇండ్లులేని ప్రజలు,రొడ్లులేని గ్రామాలు వుండడం సిగ్గుచేటన్నారు.తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడంలేదు అని ఆవేధన వ్యక్తం చేశారు.

అభివృద్ది గురించి గొప్పలు చెప్పుకునే మంత్రి జగదీష్ రెడ్డి పాత సూర్యాపేటను సందర్శించాలని,కనీసం అప్పుడైనా వాస్తవాలు తెలుస్తాయన్నారు.జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న దుబ్బతండాకు కూడా రోడ్డు లేకపోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనమన్నారు.

ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం ఓట్లకోసం మాత్రమే వచ్చే నాయకులకు రానున్న ఎన్నికలలో బుద్ది చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి జిల్లా అద్యక్షుడు మాండ్ర మల్లయ్య,ఆత్మకూర్ (ఎస్) మండల పార్టి అద్యక్షుడు కొల్లు కృష్ణారెడ్డి,మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ రఫీ,విద్యార్ధి సమితి జిల్లా అధ్యక్షుడు వినయ్ గౌడ్,ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జాటోత్ శ్రీను నాయక్,రైతు సమితి జిల్లా ఉపాధ్యక్షుడు తండు రాములు,నాగబాబు,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube