తెలంగాణలో బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.ఇప్పటికే పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరారు.ఢిల్లీలో తెలంగాణ వ్యవహారాల బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతల సమక్షంలో కాషాయ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
బీజేపీ గూటికి చేరిన దాసోజు శ్రవణ్ కు ఎంపీ లక్ష్మణ్ పుష్ఫగుచ్చాన్ని అందించారు.అనంతరం తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి పార్టీ సభ్యత్వ కార్డును అందించి అభినందనలు తెలిపారు.
అయితే, ఈ నెల 21న బీజేపీలో చేరతారనుకున్న దాసోజు.ముందుగానే కాషాయ కండువా కప్పుకోవడం గమనార్హం.







