సీతారామం మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలివే.. బింబిసారలో సగం అంటూ?

దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సీతారామం సినిమా థియేటర్లలో విడుదలై ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది.తొలిరోజు ఈ సినిమాకు పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

 Seetharamam Movie First Day Collections Details Here Goes Viral, First Day Coll-TeluguStop.com

దుల్కర్ సల్మాన్ కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా గుర్తింపు లేకపోవడం ఈ సినిమాకు ఇక్కడ కలెక్షన్ల విషయంలో కొంతవరకు మైనస్ అయింది.తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కావడం సీతారామం సినిమాకు ఒక విధంగా ప్లస్ అయింది.

ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3.05 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.నైజాంలో ఈ సినిమా 54 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా సీడెడ్ లో ఈ సినిమాకు 16 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు 21 లక్షల రుపాయల కలెక్షన్లు రావడం గమనార్హం.

గోదావరి జిల్లాలలో ఈ సినిమా 23 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.

కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఈ సినిమాకు 28 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.నెల్లూరులో ఈ సినిమాకు 8 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా 15 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈ సినిమా సక్సెస్ తో రష్మిక మరోసారి గోల్డెన్ లెగ్ అని ప్రూవ్ చేసుకుంది.

Telugu Bimbisara, Dulquer Salmaan, Day, Mrinal Thakur, Rashmika, Seetharamam, Se

బింబిసార, సీతారామం సినిమాల విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని కంటెంట్ ఉన్న కథలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.సీతారామం సక్సెస్ చిత్రయూనిట్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube