'ఆఫత్' సాంగ్ లో రెచ్చిపోయిన లైగర్ జోడి.. విజయ్, అనన్య కెమిస్ట్రీ అదుర్స్!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’.ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.

 Aafat Video Song In Liger Vijay Devarakonda Liger, Vijay Deverakonda, Ananya Pan-TeluguStop.com

ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరీ ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత వీరి ఎదురు చూపులు పీక్స్ కు చేరుకున్నాయి.ఇటీవలే థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేసారు.ఇప్పటికే రిలీజ్ అయినా రెండు సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్ము లేపేస్తున్నాయి.

ఇక ఈ రోజు ఆఫత్ అనే రొమాంటిక్ పాట రిలీజ్ చేసారు.ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే కెమిస్ట్రీ సూపర్ అనిపించింది.అనన్య హాట్ అందాలు ప్రేక్షకులను మెప్పించే విధంగానే ఉన్నాయి.ఈ రొమాంటిక్ సాంగ్ ఈ సినిమాకు స్పెషల్ గా నిలిచే అవకాశం ఉంది.ఎందుకంటే పూరీ బీచ్ సాంగ్ లను తెరకెక్కించడంలో టాప్ లో ఉంటాడు.ఇలాంటి సాంగ్స్ అన్ని ఫేవరేట్ గా నిలుస్తూ ఉంటాయి.

ఇక ఇప్పుడు ఈ సాంగ్ కూడా స్పెషల్ ఆయె అవకాశం అయితే ఉంది.ఇన్ని అంచనాలతో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తూంయిందో చూడాలి.

https://youtu.be/sasKCx8oUQc
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube