వీరు చేసిన తప్పు నిఖిల్ కు కలిసి వచ్చేలా చేస్తుందిగా!

సినీ ఇండస్ట్రీలో ఒకరు చేసిన తప్పు మరొకరికి కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇలా జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 Nikhil Siddharth Karthikeya 2 Movie Latest Details, Nikhil Siddharth, Karthikeya-TeluguStop.com

అయితే తాజాగా ఇలాంటి ఘటన మరొకటి జరిగింది.బాలీవూడ్ హీరోలు చేసిన పనికి నిఖిల్ కు బాగా కలిసి వచ్చింది.

అసలే వరుస వాయిదాలు పడుతున్న కార్తికేయ 2 కారణంగా నిఖిల్ అసంతృప్తిగా ఉన్నారు.

ఈ క్రంమలోనే బాలీవుడ్ లో జరిగే సంఘటనలు నిఖిల్ కు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ 2 హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు.

ప్రెసెంట్ నిఖిల్ నటిస్తున్న సినిమాల్లో కార్తికేయ 2 కూడా ఉంది.ఈయన కెరీర్ లో కార్తికేయ సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇప్పుడు ఆ సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 చేస్తున్నాడు.

ఈ మధ్య కాలంలో రాబోతున్న సినిమాల్లో ఆడియెన్స్ కార్తికేయ 2 పై కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు చేస్తున్న కార్తికేయ 2 ఎలాంటి సస్పెన్స్ క్రియేట్ చేయనుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Telugu Bollywood, Chandu Mundeti, Karthikeya, Raksha Bandhan-Movie

ఈ సినిమాను తమిళ్, మలయాళం, భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా.పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పథకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఆగష్టు 12న రిలీజ్ అవ్వాల్సి ఉండగా.కొన్ని కారణాల వల్ల ఆగష్టు 13కు వాయిదా వేశారు.

రిలీజ్ వాయిదా వేయాల్సి రావడంతో నిఖిల్ కొద్దిగా హార్ట్ అయ్యారు.అయితే ఈ క్రమంలోనే నిఖిల్ సినిమాకు బాలీవుడ్ లో కలిసి వచ్చేలా ఉంది.ఈ వీక్ లోనే రిలీజ్ అవ్వాల్సిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ సినిమాలకు అక్కడి ప్రేక్షకుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

Telugu Bollywood, Chandu Mundeti, Karthikeya, Raksha Bandhan-Movie

ఈ సినిమాలను బ్యాన్ చేయాలని అక్కడ ప్రచారం జరుగుతుంది.ఇదే విషయం నిఖిల్ సినిమాకు కలిసి వస్తుంది.ఈ సినిమాల వల్ల శ్రీకృష్ణుడి రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన కార్తికేయ 2 మాత్రమే చూడాలని ప్రచారం జరుగుతుండడం విశేషం.

అభిషేక్ అగర్వాల్ వల్ల కూడా ఈ సినిమాకు కలిసి వస్తుంది.అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలపై ద్వేషం కార్తికేయ క్యాష్ చేసుకోబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube