చరణ్ శంకర్ మూవీకి మరో కొత్త టైటిల్ వైరల్.. భారీగా అంచనాలు పెరిగేలా?

ప్రస్తుతం తెలుగులో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో చరణ్ శంకర్ కాంబో మూవీ ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు గతంలో ఎన్నో టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.

 New Title Fixed For Charan Shankar Combination Movie Details Here Goes Viral New-TeluguStop.com

అయితే వైరల్ అయిన టైటిల్స్ గురించి చిత్రయూనిట్ స్పందించలేదు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో కొత్త టైటిల్ వైరల్ అవుతోంది.

సీఎం అనే టైటిల్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

సాధారణంగా సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనే అర్థం వస్తుంది.

అయితే శంకర్ మాత్రం కామన్ మ్యాన్ అనే అర్థం వచ్చేలా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారని తెలుస్తోంది.ఈ టైటిల్ ఫిక్స్ అయితే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఈ సినిమాపై టైటిల్ వల్లే అంచనాలు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.2023 సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుకాలేదని తెలుస్తోంది.చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని, ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా చిత్రయూనిట్ నుంచి ఈ వార్తలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు.

Telugu Charan, Dil Raju, Kiara Adavani, Shankar, Sj Surya-Movie

ఎస్.జె.సూర్య ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది.చరణ్ కు ఆచార్య ఫలితం షాకిచ్చినా శంకర్ సినిమా చరణ్ కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సినిమాసినిమాకు చరణ్ రేంజ్ పెరుగుతుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో చరణ్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.చరణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube