మంచు లక్ష్మికి తెలుగు అస్సలు రాదట.. దారుణమైన ట్రోల్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు,హీరో మోహన్ బాబు కుమార్తె నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరో మోహన్ బాబు కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచులక్ష్మి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

 Trolls Of Netizens On Manchu Lakshmi Language, Netizens Troll, Tollywood, Manchu-TeluguStop.com

కాగా మంచు లక్ష్మి తరచు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు, తన కూతురికి, తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇక మంచు లక్ష్మి మాట్లాడే తెలుగు పై నెటిజన్స్ ఏ రేంజ్ లో ట్రోలింగ్స్ చేస్తుంటారో మనందరికీ తెలిసిందే.అయితే తనపై జరిగే ట్రోల్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటుంది.

తరచూ ఈమె ఏదో ఒక విషయంలో ట్రోలింగ్స్ నీ ఎదుర్కొంటూనే ఉంటుంది.మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆమె మాట్లాడే తెలుగు భాష పై భయంకరమైన మీమ్స్ వస్తూనే ఉంటాయి.

ఎంతోమంది ఇతర ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తెలుగు భాషను నేర్చుకుంటుంటే ఇక్కడ తెలుగు వారు మాత్రం భాష రాదు అంటు విమర్శలకు గురవుతున్నారు.అలా మంచు లక్ష్మి కూడా తనకు తెలుగు రాదు అని చెప్పి విమర్శలపాలు అవుతున్నారు.

Telugu Language, Manchu Lakshmi, Netizens Troll, Telugu, Tollywood-Movie

అయితే తనకు తెలుగు రాదని ముఖ్యంగా చదువు చదవడం అసలు చేతకాదని ఆమె చెప్పడంపై సోషల్ మీడియాలో ఆమెపై దారుణమైన కామెంట్లతో ట్రోల్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.అయితే ఈమె తెలుగు భాషకు అమెరికన్ యాస కలిపి మాట్లాడుతూ ఉంటే ఎంజాయ్ చేసేవారు చాలామంది ఉన్నారు.ఈ క్రమంలోనే ఆమెను టోలింగ్స్ చేసే వారు కూడా అంతే మొత్తంలో ఉన్నారు.

తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఆమె నేను పెరిగిన వాతావరణం వేరు.సినీ ఇండస్ట్రీ వేరు అని చెప్పుకొచ్చింది.

ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా కూడా నేను వాటిని ఆనందంగా స్వీకరిస్తాను అని అంటుంది మంచు లక్ష్మి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube