తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జెర్సీ, ఆరట్టు, కృష్ణ అండ్ హిస్ లీల, విక్రమ్ వేద లాంటి సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది శ్రద్ధా శ్రీనాథ్.
ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్ధా శ్రీనాథ్ ఒక మీడియాపై మండిపడింది.ఒక మీడియా శ్రద్ధా శ్రీనాథ్ ఫోటోని షేర్ చేస్తూ శ్రద్ధా దాస్ అని ప్రచురించడంతో అది కాస్తా హీరోయిన్ కంట పడింది.
దాంతో హీరోయిన్ సదరు మీడియా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.వార్ని,అన్ని లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మీకు నా పేరు కూడా రాయడానికి రావట్లేదా అంటూ వారిపై కోప్పడింది శ్రద్ధా శ్రీనాథ్.
అంతేకాకుండా తన పేరుని సరిగ్గా పలుకుతున్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది ఈ ముద్దుగుమ్మ.నా పేరును సరిగా ఉచ్చరించేవారిని అభినందిస్తున్నాను.మీ కీబోర్డులో దాస్ లేదా కపూర్ అని చూపించిన కూడా శ్రద్ధా శ్రీనాథ్ అని సరిగా టైప్ చేస్తున్నారు అంటే అది మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం.ఇంస్టాగ్రామ్ లో నా పేరును శ్రద్ధా రామా శ్రీనాథ్ అని మార్చుకున్నాను.
ఇక ట్విట్టర్ లో కూడా ఇలాగే మార్చుకుంటే బెటర్ ఏమో అని ఆమె తెలిపింది.రామా అంతే తన తల్లి పేరు అని, కాబట్టి ఇకపై తనను శ్రద్ధా రామా శ్రీనాథ్ అనే పరిచయం చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది శ్రద్ధా శ్రీనాథ్.
అంతేకాకుండా ఈ విషయం గురించి మీరు చింతించకండి.నన్ను శ్రద్ధ దాస్ లేదా శ్రద్ధా కపూర్ అనే కాకుండా కేవలం శ్రద్ధా శ్రీనాథ్ అని పిలవండి చాలు.పెద్ద పెద్ద మీడియా సంస్థలు నా పేరు కూడా సరిగా రాయడం లేదు.జర్నలిజం స్కూలులో పెద్దగా క్లాసులు వినకపోయి ఉండవచ్చు ఇకపై అయినా నా పేరు కరెక్ట్ గా రాయండి.
సరే మరి.మరో నాలుగు నెలల వరకు నేను ట్విట్టర్ కి బ్రేక్ ఇస్తున్నాను అంటూ వరుస ట్వీట్స్ చేసింది శ్రద్ధా శ్రీనాథ్.