ఒకప్పుడు భారతీయ సినిమాలు అంటే కేవలం బాలీవుడ్ సినిమాలనీ మాత్రమే చెప్పుకునేవారు.గత రెండు సంవత్సరాల క్రితం వరకు బాలీవుడ్ సినిమాల హవా కొనసాగింది.
అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి భారతీయ సినిమా అంటే సౌత్ సినిమాలు అనే స్థాయికి దక్షిణాది సినీ పరిశ్రమ అభివృద్ధి చెందింది.అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో సౌత్ నార్త్ అనే ట్రెండ్ కొనసాగుతోంది.
గత కొంతకాలం నుంచి దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి తెరకెక్కిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాయి.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నాయి.
ఇక బాలీవుడ్ సినిమాలు కేవలం బాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కూడా పెద్దగా ఆదరణ పొందలేదు.దీంతో బాలీవుడ్ సినీ పరిశ్రమ పని అయిపోయిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ వార్తలపై నటి అలియా భట్ స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఏ భాషలో అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈమె తెలిపారు.

ఇకపోతే కరోనా సమయం తర్వాత చిత్ర పరిశ్రమ కష్టకాలంలో ఉందని, ఇప్పుడిప్పుడే ఈ కష్టం నుంచి బయట పడుతుందని అలియా భట్ తెలిపారు.ప్రస్తుతం ఇండస్ట్రీ కష్టకాలంలో ఉందని కరోనా వల్ల థియేటర్ మూతపడి రెండు సంవత్సరాలు తర్వాత ఏ సినిమాలు అయితే ప్రేక్షకులు ఆదరిస్తారనే సందిగ్ధంలో ఉన్నారనే సందేహం మొదలైంది.అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన బాలీవుడ్ సినీ పరిశ్రమ పని అయిపోలేదని, ఈ విధంగా బాలీవుడ్ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని తొందరలోనే తిరిగి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పూర్వ వైభవం సంపాదించుకుంటుందని ఈమె తెలిపారు.







