సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.ఇంతలా ఈయన తన సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు అందరు పాన్ ఇండియా జపం చేస్తున్న తరుణంలో ఈయన కూడా పాన్ ఇండియా సినిమాలో నటిస్తాడా లేదా అనే సందిగ్దత అందరిలో నెలకొంది.
ఈ క్రంమలోనే ఈయనను ఒక సందర్భంలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు మహేష్ నన్ను తట్టుకోవడం చాలా కష్టం.
అక్కడి ప్రేక్షకులు నన్ను తట్టుకోలేరు.నాకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన తెలుగు సినీ పరిశ్రమను ఇక్కడి ప్రేక్షకులను వదిలి అక్కడికి వెళ్లాలని లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.
ఈయన వ్యాఖ్యలపై కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు సీరియస్ అయ్యారు.
ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాలీవుడ్ ఎంట్రీపై మరోసారి చర్చ జరుగుతుంది.
ఒక భారీ ప్రాజెక్టుతో మహేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్ వస్తుంది. మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవ లే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఆ తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా అడవుల బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ కావడంతో రాజమౌళి ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండాలని.
అలాగే భారీ తారాగణం, విదేశీ సాంకేతిక నిపుణులు కూడా తప్పకుండ ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాతోనే మహేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది.మరి ఇదే నిజం అయితే మహేష్ బాలీవుడ్ లోకి వెళ్ళను అనే మాట ను నిలబెట్టుకోనట్టే అంటూ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.మరి మహేష్ ఈ వార్తలపై ఎలా స్పందిస్తాడో చూడాలి.







