ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్స్ రాజ్యమేలుతున్నవేళ దాదాపు అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్స్ ఇమిడిపోయాయి.ఇపుడు అన్ని లావాదేవీలు దాదాపుగా స్మార్ట్‌ఫోన్‌లలోనే జరుగుతున్నాయి.
అయితే ఎన్ని పనులు చేసినప్పటికీ మనిషిని ఏదో ఒక వెలితి వెంటాడుతూనే ఉంటాయి.అందులో ఒకటే మనం తీసుకున్న ఫోటోలను ప్రింట్ తీసుకోవడం.అవును… కెమేరాలకు ధీటుగా మొబైల్ ఫోన్స్ ఫోటోలు తీయడంలో మెరుగులు దిద్దుకున్నాయి.అయితే తీసిన ఫోటో ప్రింట్ తీయాలంటే ఫోటో లాబ్స్ కి వెళ్లాల్సిన పరిస్థితి.
ఇటువంటి తరుణంలో అదే ఫీచర్ ఫోన్ కి జోడిస్తే ఎలా ఉంటుంది?.
అదే ఐడియాని ఇపుడు ఇంప్లిమెంట్ చేసారు.అవును… స్మార్ట్‌ఫోన్ కెమెరా ప్రింటర్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.తాజాగా జపానీస్ ఫొటోగ్రఫీ బ్రాండ్ ‘ఫుజీ ఫిల్మ్’ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఫొటోలను నేరుగా ప్రింట్ చేసేందుకు అనువైన స్మార్ట్‌ఫోన్ కెమెరా ప్రింటర్‌ను తీసుకువచ్చింది.
ఈ ప్రింటర్ పేరు ‘ఇన్‌స్టాక్స్ మినీలింక్ 2.’ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ ప్రింటర్ కూడా వెంట ఉంటే, ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు ఫొటోలను ప్రింట్ తీసుకోవచ్చు.
ప్రస్తుతం ఇది జపాన్‌తో పాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్‌లలో అందుబాటులో ఉంది.ఇకపోతే ఈ ప్రొడక్ట్ ని అతి త్వరలో ఆసియా అంతటా మార్కెటింగ్ చేయనున్నారు.
కాబట్టి సెల్ఫీ ప్రేమికులారా యుద్ధానికి సిద్ధంగా వుండండి.ఈ ప్రొడక్ట్ త్వరలో ఆన్లైన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.
సరైన సమయంలో ఆర్డర్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి.