టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే.నందమూరి కుటుంబం నుండి పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక ఈయనకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఈయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి 1991లో విడుదలైన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో భరతుడు పాత్రలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్.ఆ తర్వాత బాల రామాయణము సినిమాలో కూడా నటించాడు.
ఇక 2001లో నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ 1, సుబ్బు, ఆది సినిమాలలో హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఆ తర్వాత ఏడాదికి వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకెళ్లి స్టార్ హీరోగా నిలిచాడు.
చాలావరకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ లనే సొంతం చేసుకున్నాడు.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.
కేవలం వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షోలలో వ్యాఖ్యాతగా చేశాడు.
ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ గా మారాడు.
ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రతో ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పించాడు.
ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఈయన మరో స్టార్ డైరెక్టర్ల కాంబినేషన్లో సినిమాలు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఎన్టీఆర్ వ్యక్తిగత విషయానికి వస్తే.
ఆయన మంచితనం ఏంటో అందరికీ తెలిసిందే.కేవలం సినిమాలనే కాకుండా తన ఫ్యామిలీ జీవితాన్ని కూడా బాగా పట్టించుకుంటాడు.
తన విషయంలో కూడా తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు.ఇక ఈయన చూడటానికి సింపుల్ గా ఉన్నా కూడా ఆయన వాడే బ్రాండ్లు మాత్రం చాలా కాస్ట్లీగా ఉంటాయి.

ఆయన ధరించే వాచ్ నుంచి ప్రయాణించే కారు వరకు కాస్ట్లీ గా ఉంటాయి.కేవలం ఈయన కాకుండా ఇతర స్టార్ హీరోలు కూడా తాము వాడే వస్తువులను చాలా కాస్ట్లీవి వాడుతుంటారు.ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ ధరించే దుస్తులు చూస్తే మాత్రం మామూలుగా కనిపించిన కూడా అవి మాత్రం చాలా కాస్ట్లీ గా ఉంటాయి.
ఇటీవల ఆయన ధరించిన టీ షర్ట్ ధర కూడా చాలా ఎక్కువగా ఉంది.
ఇటీవలే ఆయన తన సోదరుడు కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఈవెంట్ కు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈయన ఈవెంట్ లో ఎన్నో విషయాలు పంచుకోగా అందులో చాలామంది ఎన్టీఆర్ మాటల కంటే ఎన్టీఆర్ ధరించిన టీ షర్టును చూసి ఫీదా అయ్యారు.
దీంతో ఆ టీ షర్టు ధర ఎంత అని బాగా సర్చ్ లు కూడా చేయగా దాని ధర దాదాపు 20వేల నుండి 30 వేల మధ్యలో ఉంటుంది అని తెలిసింది.దీంతో ఇంత ధర అని తెలియటంతో నెటిజన్లు బాగా షాక్ అవుతున్నారు.







