ప్రభాస్ యూరప్ ట్రిప్‌.. అసలు విషయంపై యూవీ వారి క్లారిటీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే యూరప్ వెళ్లిన విషయం తెలిసిందే.ఆయన యూరప్ పర్యటన పై అభిమానుల్లో మరియు మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

 Hero Prabhas Europe Trip Interesting Update , Aadipurush, Movie News, Prabhas, P-TeluguStop.com

ప్రభాస్ కొన్ని వారాల క్రితం ఆపరేషన్ నిమిత్తం యూరప్‌ వెళ్ళాడు.ఆయన కాలు ఆపరేషన్ కోసం వెళ్లిన నేపథ్యం లో షూటింగ్స్ అన్నింటికీ కొన్నాళ్ల పాటు బ్రేక్ పడింది.

ఇటీవలే ఆయన మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఈ సమయం లో మళ్లీ యూరప్ వెళ్లడం తో అంతా కూడా మరో ఆపరేషన్ నిమిత్తం ప్రభాస్ వెళ్లి ఉంటాడు అంటూ చర్చించుకుంటున్నారు.

కానీ మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మరో ఆపరేషన్ కోసం అక్కడికి వెళ్ళ లేదు.గతంలో జరిగిన ఆపరేషన్ తాలూకు ట్రీట్మెంట్ మరియు చెకప్ కోసం ఆయన యూరప్ వెళ్ళాడు.

ఈ విషయాన్ని యు.వి.క్రియేషన్స్ కి సంబంధించిన ప్రతినిధులు అనధికారికంగా తెలియ జేశారు.మొన్నటి వరకు ప్రాజెక్టు షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ యూరప్ నుంచి రాగానే షూటింగ్లో బిజీ అవ్వబోతున్నాడు.

ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్‌ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నాడు.వచ్చే ఏడాది ఆరంభం లో ఆ బాలీవుడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరో వైపు సలార్ సినిమా ని కూడా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని దర్శకుడు గతంలో ప్రకటించాడు.ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రాజెక్టు కే సినిమా కూడా వచ్చే ఏడాది లోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటీవల నిర్మాత అశ్వినీదత్ పేర్కొన్నాడు.

మొత్తానికి 2023 సంవత్సరం లో ప్రభాస్ ఒక రేంజ్ లో తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి వందల నుండి వేల కోట్ల వరకు వసూళ్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube