ఉర్ఫీ జావేద్.ఈమె పేరు తెలియని యూత్ లేరంటే అతియసోక్తి కాదేమో.
సోషల్ మీడియా చూసే వారికీ ఈమె గురించి బాగా తెలుసు.తక్కువ సమయంలోనే ఉర్ఫీ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించు కుంది.
ఈమె తన డ్రెసింగ్ స్టైల్ తో వెరైటీ డ్రెస్ లతో ఎప్పుడు సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.తన స్పెషల్ డ్రెస్సింగ్ స్టయిల్ తోనే ప్రతి ఒక్కరిని ఆకట్టు కుంటూ అందచందాలను ఆరబోస్తుంది.
కొత్త కొత్త ఫ్యాషన్ ను ట్రై చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది.అయితే ఇంతకు ముందు ట్రోల్ చేసినట్టు ఈమెను ట్రోల్ చేయడం నెటిజెన్స్ మానేశారు.
దీంతో ఈమె మళ్ళీ ట్రేండింగ్ లోకి రావాలని గట్తి ప్రయత్నాలే చేస్తుంది.ఇందుకు ఈమె బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ఉపయోగించు కుంది.
రణవీర్ సింగ్ ఇటీవలే నగ్న ఫోటో షూట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.ఒక స్టార్ హీరో హోదాలో ఉండి ఇలా నగ్నంగా ఫోటో షూట్ చేయడం పై కొందరు సమర్దిస్తుంటే.
మరికొంత మంది ఈయనపై ట్రోల్స్ చేస్తున్నారు.దీంతో ఈ అంశం వివాదాస్పదం అవుతుంది.
ఇప్పుడు ఈ వివాదంలోకి బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ కూడా చేరిపోయింది.

ఆమెకు అవసరం లేకపోయినా ఈ విషయంలోకి దూరి ఫేమస్ అవ్వాలని అనుకుంటుంది.ఈమె రణవీర్ ఫోటో షూట్ విషయంలో రణవీర్ కు మద్దతుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.మీకు ఏదైనా సమస్య ఉంటే వారిని మాత్రమే ట్రోల్ చేయండి.
ఆయన భార్య ను మధ్యలోకి లాగొద్దు అంటూ ఈమె కామెంట్స్ చేసింది.గతంలో నేను కూడా ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కొన్న అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయంలో ఈమె స్పందించడం వల్ల మరోసారి నన్ను కూడా ట్రోల్ చేయండి అని ఆమె కోరుకుంటుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.







