సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.మహేష్ బాబు ను ప్రిన్స్ నుండి సూపర్ స్టార్ గా ఎదగడంలో కీలక పాత్ర ఆ సినిమా పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేనే లేదు.
మహేష్ బాబు అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఇప్పుడు.ఎప్పుడు కూడా పోకిరి గురించి మాట్లాడుతూనే ఉంటారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ఆ సినిమా ను ఆ స్థాయి లో తెరకెక్కించాడు.రికార్డులు బద్దలు కొట్టిన పోకిరి సినిమాను ఆగస్టు లో మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా రీ రిలీజ్ కు ప్లాన్ చేశారు.
దేశ వ్యాప్తంగానే కాకుండా అమెరికా ఇతర దేశాల్లో కూడా మహేష్ బాబు ఫ్యాన్స కోరుకుంటే విడుదల చేయడంకు సిద్దం అంటూ ప్రకటించారు.
పోకిరి సినిమా రీ రిలీజ్ కు అనూహ్య స్పందన వస్తోంది.
అమెరికాలోని ఒక థియేటర్ లో రీ రిలీజ్ చేయబోతున్నాం అంటూ ప్రకటించి అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టిన కొన్ని గంటల్లోనే మొత్తం టికెట్లు అమ్ముడు పోయి హౌస్ ఫుల్ అయ్యింది.పోకిరి సినిమాకు వస్తున్న మాస్ రెస్పాన్స్ కు ఇతర హీరోల అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పోకిరి ఒక సెలబ్రేషన్ అన్నట్లుగా అభిమానులు విడుదల చేస్తున్నారు.అందుకే ముందు ముందు ఎన్టీఆర్.చరణ్.చిరంజీవి ఇంకా ఇతర స్టార్ హీరోల సినిమాలను కూడా ఒక పండుగ మాదిరిగా జరుపుకునేందుకు వారి వారి సినిమాల్లో సూపర్ హిట్ సినిమాలను వెదుకుతున్నారు.
చిరంజీవి ఇంద్ర మరియు చరణ్ యొక్క మగధీర సినిమా ను రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్.ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా లు రీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.







