కొన్ని కొన్ని సమయాలలో సెలబ్రెటీలకు నేరుగా ప్రశ్నలు ఎదురవుతుంటాయి.అది కూడా వ్యక్తిగత విషయంలోనే ఎక్కువగా ఎదురవుతుంటాయి.
దాంతో కొందరు నిజాలు చెప్పటానికి ఇబ్బంది పడగా మరికొందరు ఓపెన్ గా చెప్పేస్తారు.అది ఏ విషయమైనా సరే దాచకుండా అన్ని బయటపెడతారు.
అలా తాజాగా రౌడీ విజయ్ దేవరకొండ కూడా తన వ్యక్తిగత విషయాలలో ఓపెన్ గా చెప్పుకున్నాడు.
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.
ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ అటువంటిది.ఇక వరుస ఆఫర్ లతో అవకాశాలు కూడా సొంతం చేసుకున్నాడు.
ఇక విజయ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండగా అక్కడ కూడా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.
ఈయన కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన విజయ్ 2016 పెళ్లి చూపులు సినిమా తో హీరోగా పరిచయం అయ్యాడు.
ఇక ఆ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న విజయ్ ఆ తర్వాత నటించిన ద్వారక సినిమా లో అంత సక్సెస్ పొందలేకపోయాడు.కానీ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డు సొంతం చేసుకున్నాడు.

అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత కూడా పలు సినిమాలలో నటించగా.అంతగా సక్సెస్ కాలేకపోయాడు.ఇక ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వెలువడుతున్నాయి.

ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో విడుదల కానుంది.ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతుంది.
ధర్మా ప్రొడక్షన్, పూరి కనెక్ట్ సంయుక్తంగా ఈ సినిమాను కరణ్ జోహార్, ఛార్మికౌర్, అపూర్వ మేహత, హీరూ యష్ జోహార్, పూరి జగన్నాథ్ నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.
ఇందులో మైక్ టైసన్, రమ్యకృష్ణ, ఆలీ, రోనిత్ రాయ్ తదితరులు నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రస్తుతం ప్రమోషన్స్ భాగంలో బిజీగా ఉన్నారు.
ఇటీవలే ఈయన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నాడు.

అయితే అందులో ఆయనకు ఎదురైన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఇక మరో ప్రశ్న కూడా కరణ్ అడిగాడు.అదేంటంటే ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్ లో సెక్స్ చేశావా అని అడగటంతో బోటులో అని సమాధానం ఇచ్చాడు.
ఇక పబ్లిక్ ప్లేస్ లో అని అడగటంతో కారులో కూడా ఆశపడిన సందర్భాల్లో అని అన్నాడు.ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.