ఇండస్ట్రీలో క్యాసినో వివాదం తీవ్ర దుమారం రేపుతుంది.రోజురోజుకు ఈ కేసులో భాగంగా పలువురు సెలబ్రిటీల పేర్లు బయటకు రావడంతో పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ కేసు పై దర్యాప్తు కొనసాగిస్తూ నిజాలను వెలికితీస్తున్నారు.
ఈ విధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులలో భాగంగా పలువురు సినీ హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి.ఈ క్రమంలోనే చీకటి ప్రవీణ్ మాధవ రెడ్డి అనే వ్యక్తులతో పాటు మరో ఎనిమిది చోట్ల అధికారులు సోదాలు నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడించారు.
వీరిద్దరూ క్యాసినో సెంటర్లకు లోకల్ ఏజెంట్లుగా పనిచేయడంతో వీరిని అదుపులోకి తీసుకోవడంతో విలువైన సమాచారం రాబట్టారు.
ఇక ఈ విషయంలో భాగంగా నేపాల్ కు చెందిన పదిమంది సినీ తారాలను రప్పించే వారి చేత పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ సెలబ్రిటీల పారితోషకాల లిస్ట్ కూడా బయటకు రావడంతో ఎవరెవరు ఎంత తీసుకున్నారనే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రమంలోనే నటి మల్లికా శరావత్ కోటి రూపాయలు అమీషా పటేల్ 80 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నటీమణులతో పాటు ఈషా రెబ్బ 40 లక్షలు గణేష్ ఆచార్య 20 లక్షలు, ముమైత్ ఖాన్ 15 లక్షలు, డింపుల్ హైయతీ 40 లక్షలు గోవిందా 50 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు.ఈ విధంగా ఈ సినీ తారలకు సంబంధించిన పారితోషక లిస్ట్ పై ఈడీ అధికారులు నోటీసులు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.అయితే ఈ చీకటి ప్రవీణ అధికారులకు పట్టబడటంతో ఒక్కొక్కటిగా వీరు చేస్తున్న చీకటి కోణాలు బయట పడుతున్నాయి.అయితే వీరి వెనుక పెద్దపెద్ద బడా బాబులు ఉన్నారన్న అనుమానంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.







