గత రెండు రోజులుగా చికోటి ప్రవీణ్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం విధితమే.అయితే చికోటి ప్రవీణ్ లిస్టులో చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకుల పేర్లున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఏపీకి చెందిన వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్యాసినో వ్యవహారంపై స్పందించారు.మాజీ మంత్రిపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.
తాను అప్పుడప్పుడూ క్యాసినోకి వెళ్తుంటానని, పేకాట ఆడుతానని తెలిపారు.అయితే చీకోటి ప్రవీణ్‌తో కానీ.
హవాలాతో కానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు.తనపై వస్తున్న ప్రచారం అవాస్తవాలని తెలిపారు.
తనపై బురద చల్లే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.