బోనాలు పండుగను కూడా వాడేస్తున్నారు.. ఇక ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంతు!

సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినా లేదా స్పెషల్ డే అయిన ఆ రోజును క్యాష్ చేసుకొని పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు.ప్రస్తుతం తెలంగాణలో బోనాల జాతర జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.

 Bonala Jathara At Sridevi Drama Company Event Viral, Sridevi Drama Company, Bona-TeluguStop.com

ఈ క్రమంలోనే బోనాల పండుగను కాష్ చేసుకున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం వారు బోనాల జాతర అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర నటీనటులు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పాల్గొనే పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఈ విధంగా బోనాల జాతరలో భాగంగా ఆటపాటలతో ప్రేక్షకులను సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి మొదట్లో ఇంద్రజ న్యాయ నిర్ణయితగా వ్యవహరించేది.అయితే ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి పర్మినెంట్ జడ్జి అయిన తర్వాత ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నారు.

అయితే తాజాగా ఈమె మరోసారి బోనాల జాతర సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కి రీ ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ లు పెద్ద ఎత్తున ఎప్పటిలాగే తమదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినట్టు తెలుస్తోంది.

Telugu Bonalu Jathara, Karthikeya, Nikhil, Sridevidrama-Movie

ఇక సీరియల్ నటి శిరీష అమ్మవారి రూపంలో దర్శనమిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.ఇక బాలకృష్ణ పవన్ కళ్యాణ్ వేషధారణలో నటీనటులు ఆటపాటలతో ఎంతో సందడి చేసినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమంలో కార్తికేయ 2 చిత్ర బృందం హాజరయ్యే సందడి చేశారు.ఈ క్రమంలోనే నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ ఈ కార్యక్రమంలో సందడి చేయగా అనుపమ ఎంతో చక్కగా పాట పాడుతూ అందరిని ఫిదా చేసింది.

ఈ ప్రోమో చూడగానే కన్నుల పండుగగా ఉంది ఇక పూర్తి ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube