అవినాష్ అతి తగ్గట్లేదుగా.. సీరియల్ జోడి కావ్య-నిఖిల్‌లపై నాటీ కామెంట్లు

బుల్లి తెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే స్టార్ మా వాళ్ళు నిత్యం ఏదో ఒక కొత్త ఈవెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

 Avinash Over Comments On Serial Actress Kavya And Actor Nikhil Know Details Insi-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ వర్షం సాక్షిగా పేరుతో ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఒక హాట్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా అవినాష్ బుల్లితెర నటీనటులు పై తనదైన శైలిలో పంచులు వేస్తూ రెచ్చిపోయారు.కొందరు బుల్లితెర జోడీలు ఈ కార్యక్రమంలో వారి రొమాంటిక్ పర్ఫామెన్స్ ద్వారా డాన్స్ చేశారు.

ఈ క్రమంలోనే నిఖిల్ కావ్య వేదిక పైకి రాగ అవినాష్ మాట్లాడుతూ.మీ మధ్య ఏమన్నా ఉందా అంటే తలపట్టారు.హనీమూన్ అనగానే ఎగబడ్డారు” అంటూ నిఖిల్ కావ్య పై సెటైర్ వేశారు.ఇకపోతే శనగపిండి బజ్జీలు వేసే టాస్క్ లో భాగంగా నిరుపమ్, మంజుల, అర్జున్ సుహాసిని జోడీలు వచ్చారు.

ఇక వీరి గురించి మాట్లాడుతూ ఎందుకో ఈ టాస్క్ లో డాక్టర్ బాబు గెలుస్తారని అనుకుంటున్నాను అని అంటూనే నాలుగేళ్లుగా వంటలక్కతో కలిసి ఉన్నారు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ ఒకటి వేశారు.ఏ ఏ.ఎం చేసాడు అంటూ అవినాష్ అడిగేసరికి వంటలు చేసాడయ్యా అంటూ అర్జున్ సెటైర్ వేశారు.

ఇక ఈ ప్రోమో చివరిలో అవినాష్ శ్రీముఖి ఇద్దరు ముద్దు పెట్టుకున్నట్లు చూపిస్తూ ప్రోమో కట్ చేశారు.మొత్తానికి ఈ ప్రోమో అందరిలో ఎంతో ఆసక్తిని కలిగించిందని చెప్పాలి.ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాలంటే ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

ఈ ప్రోమో చూస్తుంటే బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో రొమాంటిక్ పర్ఫామెన్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube