సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోయిన్లు సినిమాలో సక్సెస్ కాలేకపోయినా కూడా తమ పెళ్లి జీవితంలో మాత్రం మంచి సక్సెస్ తో ముందుకు వెళుతున్నారు.మరికొందరు మంచి జీవితాన్ని వదిలేసుకొని సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇక వాళ్లెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబంతో సంతోషంగా ఉంటున్న హీరోయిన్లలో ప్రణీత సుభాష్ ఒకరు.
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ గురించి అందరికీ పరిచయమే.తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ఏం పిల్లో.ఏం పిల్లడో అనే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.
ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఆ తర్వాత బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో నటించింది.కానీ ఎందుకో టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది.ఈమె టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది.

అంతేకాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి తనేంటో నిరూపించుకుంది.ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో కోవిడ్ సమయంలో కూడా ఎంతో మంది ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.ప్రణీత ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికీ చాలా మందికి సహాయం చేస్తూనే ఉంది.
ఇక ఈమె బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.
ఈమధ్య తన కూతురు ఫోటోలను కూడా పంచుకుంటుంది.తన ఫాలోవర్స్ తో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.అందులో తన భర్త కాళ్లు కడిగి పువ్వులు పెట్టినట్లు కనిపించింది.పైగా ఆ ఫోటోలో తను ఎంతో ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది.ఇక భీమన అమావాస్య సందర్భంగా తన భర్తకు అలా పూజ చేసినట్లు తెలిపింది.
ఈ ఫోటో బాగా వైరల్ అవ్వడంతో తన ఫాలోవర్స్ తో పాటు నెటిజన్లు మీరు గ్రేట్ మేడం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ప్రణీత సినిమాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం ఫ్యామిలీతో బాగా బిజీగా ఉందని తెలుస్తుంది.
ఇక తనకు కూతురు కూడా పుట్టడంతో ఈ సమయంలో తన కూతురికి, తన ఫ్యామిలీకి బాగా దగ్గరగా తాను ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.మరి ఈ ముద్దుగుమ్మ తన అభిమానుల కోసం మళ్లీ సినిమాల్లో అడుగుపెడుతుందో లేదో చూడాలి.







