ఈ దేశంలో సెలిబ్రిటీలైన సినిమాళ్ళకి, క్రీడాకారులకు వున్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.క్రికెట్ క్రీడాకారుడు విరాట్ కోహ్లీకి వున్న ప్రజాదరణ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.
సాధారణంగా ఇప్పటి జనరేషన్లో ఎక్కువమంది తమకు బాగా నచ్చే సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ను ఫాలో అవుతుంటారు.తాము ఫాలో అయ్యే సెలబ్రిటీ ఏ గ్యాడ్జెట్ వాడినా కూడా వాళ్లు కూడా అదే గ్యాడ్జెట్‌ను వాడాలని ప్రయత్నిస్తూ వుంటారు.
అందుకే, కంపెనీలు కూడా వ్యాపార వ్యూహంలో భాగంగా తమ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ పెరిగేందుకు సెలబ్రిటీలను తమ బ్రాండ్లకు అంబాసిడర్లుగా పెట్టుకుంటాయి.
ఇక అసలు విషయంలోకి వెళితే, తాజాగా ప్రముఖ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తాను వినియోగించే స్మార్ట్ ఫోన్ తో దిగిన ఫొటో ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.
ఇక సదరు ఫోటోని చూసిన నెటిజన్లు అందులో కోహ్లీ వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఏ కంపెనీకి చెందింది.దాని ప్రత్యేకతలు ఏంటి అని అతని ఆసక్తిగా నెట్టింట్లో వెతికేస్తున్నారు.
కాబట్టి ఇప్పుడు కోహ్లీ ఆ పిక్‌లో వినియోగిస్తున్న ఫోన్ ఏమిటన్నది మనం కూడా తెలుసుకుందాం.

విరాట్ కోహ్లీ వివో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా, తాజాగా కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలో తాను వినియోగిస్తున్నది చూడటానికి వివో బ్రాండ్‌కు చెందిన Vivo V25 Pro స్మార్ట్ ఫోన్ మాదిరి కనిపిస్తోంది.ఆ మొబైల్‌ను వినియోగిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.
మై ఫేవరేట్ షేడ్ ఆఫ్ బ్లూ (నాకు ఎంతో ఇష్టమైన నీలి రంగు) అని క్యాప్షన్‌ను పోస్ట్‌కు జత చేశారు.చాలా మంది ఆయన ఫాలోవర్స్ కూడా అది Vivo V25 Pro స్మార్ట్ ఫోన్ అయి ఉండొచ్చని కామెంట్లలో పేర్కొన్నారు.
అయితే ఇది కంపెనీ ప్రమోషన్‌లో భాగమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.







