క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన మొట్టమొదటి చిత్రం ఆర్య.సుకుమార్ మొదటి సినిమా ఆర్య కావడం విశేషం.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుందో మనందరికీ తెలిసిందే.గంగోత్రి వంటి హిట్ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా గంగోత్రి వంటి హిట్ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా కూడా హిట్ కావడంతో ఈయన ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నారు.
ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ కి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.అయితే సుకుమార్ మొదటగా ఈ సినిమాని అల్లు అర్జున్ తో కాకుండా చాలామంది హీరోలను సంప్రదించారట.
ఇలా అందరూ రిజెక్ట్ చేయడంతోనే ఈ కథ అల్లు అర్జున్ వరకు వెళ్ళింది.మరి ఈ కథను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే…
సుకుమార్ ఆర్య సినిమా స్టోరీ పూర్తి అయిన తర్వాత ఈ సినిమాని ఎవరితో చేయాలి అని ఆలోచిస్తున్న నేపథ్యంలో ముందు ఈ సినిమా కథతో సుకుమార్ నితిన్ వద్దకు వెళ్లారట.
కథ మొత్తం విన్న నితిన్ ఫస్ట్ హాఫ్ బాగుంది గాని సెకండ్ హాఫ్ కి పాజిటివ్ రెస్పాన్స్ లేదని రిజెక్ట్ చేశారట.ఇకపోతే అనంతరం దిల్ రాజు దగ్గరకు వెళ్ళగా దిల్ రాజు కథ మొత్తం విని కొన్ని మార్పులు ఉన్నాయని చెప్పినప్పటికీ ఈ సినిమాకి సరైన హీరో దొరకాలని ఎదురు చూశారు.
ఈ విధంగా నితిన్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా ప్రభాస్ వద్దకు వెళ్ళింది.అప్పుడు ప్రభాస్ వర్షం సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

అయితే ఇలాంటి లవ్ స్టోరీ తనకు సూట్ అవ్వదని ప్రభాస్ స్నేహితులు చెప్పటం వల్ల ప్రభాస్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారు.ప్రభాస్ అనంతరం ఈ సినిమా మాస్ మహారాజ రవితేజ వద్దకు వెళ్ళింది.కథ మొత్తం విన్న రవితేజ చాలా అద్భుతంగా ఉందని అయితే ఈ కథ నాలాంటి వారికి కాకుండా నితిన్ వంటి హీరోలకు బాగా సూట్ అవుతుందని సలహా ఇచ్చారట.

ఈ విధంగా ఆర్య సినిమా కథ చేయడానికి హీరోలు దొరకకపోవడంతో సుకుమార్ సరైన హీరో కోసం ఎదురుచూస్తున్నారు.అదే సమయంలోనే నితిన్ నటించిన దిల్ సినిమాను టాలీవుడ్ హీరోల కోసం ప్రీమియర్ షో వేశారు.ఈ షో చూడటానికి వచ్చిన అల్లు అర్జున్ ను సుకుమార్ చూశారట.
తన కథకు సరైన హీరో ఇతనేనని అల్లు అర్జున్ ని సంప్రదించగా ఈ కథ మెగాస్టార్ చిరంజీవికి అల్లు అరవింద్ కి విడిపించడంతో వాళ్ళిద్దరూ సినిమాకి ఓకే చెప్పిన తర్వాత దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ విధంగా ఆర్య సినిమాని ఇంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేయగా ఆ అవకాశం అల్లు అర్జున్ కి దక్కిందని చెప్పాలి.







