అదేంటి ట్రైన్లో గొడుగులు వేసుకొని ప్రయాణించడమేమిటి అని అనుకుంటున్నారా? కానీ మీరు విన్నది నిజమండి.సాధారణంగా రైల్వే ప్రయాణం బావుంటుందని చాలామంది రైలులోనే ఎక్కువగా ప్రయాణించడానికి మొగ్గు చూపుతారు.
అయితే ముంబయి నుంచి నాసిక్ వెళ్లే “పంచవటి” రైలులో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.ఎందుకంటే.
ఈ రైలులో ప్రయాణించాలంటే గొడుగు తప్పనిసరి అని చెబుతున్నారు.అదేంటి గొడుగు ఉండాల్సిన అవసరం ఏమిటి అని అనుకుంటున్నారా? ఈ విషయం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కరోనా రక్కసి దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచాన్ని తలకిందులు చేసింది.దాంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి.లాక్డౌన్ నేపథ్యంలో మన దేశంలో కూడా అనేక రైళ్లను నిలిపివేశారు రైల్వే అధికారులు.ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కో రైలును ప్రారంభిస్తూ వచ్చారు.
ఆ క్రమంలోనే కొన్ని నెలల పాటు నిలిచిపోయిన ముంబయి నుంచి నాసిక్ వెళ్లే పంచవటి రైలు తాజాగా ప్రారంభమైంది.అయితే ఈ రైలులోని ఏసీ బోగీలో ప్రయాణం.
ప్యాసింజర్లకు పెద్ద తలనొప్పిగా మారింది.గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల.
ఏసీ బోగీలో నీరు లీకై ప్రయాణికుల మీద పడుతోంది.దీంతో గత్యంతరం లేక గొడుగులు వేసుకుని ప్రయాణిస్తున్నారు ప్యాసింజర్లు.

ఈ క్రమంలో కొందరు.అలా ప్రయాణిస్తున్న ప్రయాణికుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రైల్వేశాఖను నిలదీస్తున్నారు.రూ.4 వేలు పెట్టి టికెట్లు కొని ప్రయాణం చేస్తుంటే కనీస సౌకర్యం కల్పించకపోవడంపై రైల్వే అధికారులపై మండిపడుతున్నారు.వెంటనే మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.దాంతో త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని రైల్వేశాఖ అధికారులు తెలపడం గమనార్హం.కాగా సదరు ఫోటోలు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి.నెటిజన్లు రకరకాలుగా ఈ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు.







