అతి తక్కువ రన్ టైం తో రాబోతున్న 'బింబిసార'.. ఈసారి హిట్ గ్యారెంటీనా?

నందమూరి హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు.అయితే ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో సక్సెస్ సాధించలేక పోయాడు.

 Bimbisara Official Runtime Locked Details, Kalyan Ram, Bimbisara , Bimbisara Pro-TeluguStop.com

ఈయన తన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసిన కూడా అంతగా సక్సెస్ కాలేదు.ఈయన మొదటి నుండి కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.

ఎంత విలక్షణమైన సినిమాలు చేస్తున్న ఆశించిన విజయాలు మాత్రం ఈయనకు వరించడం లేదు.

ఇక మరోసారి లాంగ్ గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు సోషియో ఫాంటసీ యాక్షన్ సినిమాతో రావడానికి సిద్ధం అవుతున్నాడు.

కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ సినిమా బింబిసార. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

Telugu Bimbisara, Catheri Thresa, Vasistha, Kalyan Ram, Kalyanram, Nandamurikaly

ఈ సినిమాలో సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను మెప్పించింది.అలాగే ఎన్టీఆర్ కూడా ఈ ప్రొమోషన్స్ లో భాగం కావడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపై మరింత ఉత్సాహం చూపిస్తున్నారు.

Telugu Bimbisara, Catheri Thresa, Vasistha, Kalyan Ram, Kalyanram, Nandamurikaly

ఇక తాజాగా ఈ సినిమా టోటల్ రన్ టైం ఎంతో బయటకు వచ్చింది.గ్రాండ్ గా తెరకెక్కించిన ఈ సినిమాకు 2 గంటల 26 నిముషాల రన్ టైం ను కట్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాను డైరెక్టర్ వసిష్ఠ చాలా అలరించే విధంగా ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించాడని స్క్రీన్ ప్లే తో సినిమా గూస్ బంప్స్ వస్తుంది అని చెప్తున్నారు.

ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే సూపర్ హిట్ అవుతుంది అని ఆయన మార్కెట్ సైతం పెరుగుతుందని చెప్పుకొస్తున్నారు.చూడాలి ఈ సినిమా ఏ మేరకు హిట్ సాధిస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube