స్టార్ యాంకర్ శ్యామల ఇల్లు చూశారా.. ఆ ఇంటి ప్రత్యేకతలు ఏంటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ యాంకర్లలో శ్యామల ఒకరు అనే సంగతి తెలిసిందే.బుల్లితెర షోలు చేయడంతో పాటు పలు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించడం ద్వారా శ్యామల తన పాపులారిటీని మరింత పెంచుకున్నారు.

 Star Anchor Syamala Home Tour Video Goes Viral In Social Media Anchor Syamala, H-TeluguStop.com

ఇంటర్వ్యూలలో, ఆడియో ఫంక్షన్ లకు శ్యామల్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే.తాజాగా శ్యామల హోమ్ టూర్ వీడియో చేయగా ఆ వీడియోకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

శ్యామల హోం టూర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.శ్యామల హోం టూర్ వీడియోలో నేను, మా ఆయన విలేజ్ అట్మాస్పియర్ నుంచి వచ్చామని అందువల్ల ఆ విలేజ్ థాట్స్ ఇంకా పోలేదని ఆమె చెప్పుకొచ్చారు.

అరుగులా ఉండేలా ఈ మెట్లను నిర్మించుకున్నామని శ్యామల పేర్కొన్నారు.రోజులో ఎక్కువ సమయం మాకు ఇక్కడే అయిపోతుందని ఆమె కామెంట్లు చేశారు.

ఈ ప్లేస్ మాకు మోస్ట్ చిల్లింగ్ ప్లేస్ అని శ్యామల చెప్పుకొచ్చారు.

అరుగు నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశమని ఆమె అన్నారు.

తాను దేవుడిని ఎక్కువగా నమ్ముతానని చెప్పిన శ్యామల మొదట పూజగదిని చూపించారు.ఆ తర్వాత తనకు వంట చేయడం ఇష్టమని చెబుతూ కిచెన్ ను చూపించారు.

కిచెన్ లోనే ఆమె పెద్ద డైనింగ్ టేబుల్ ను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.శ్యామల ఇంట్లో నాలుగు బెడ్ రూమ్స్, రెండు హాల్స్ ఉన్నాయి.

కొడుకు ఇషాన్ కు స్పెషల్ బెడ్ రూమ్ ఉండగా ఆ బెడ్ రూమ్ స్పైడర్ మ్యాన్ థీమ్ తో ఉండటం గమనార్హం.స్పైడర్ మ్యాన్ థీమ్ ఉన్న ఈ బెడ్ రూమ్ కు అటాచ్డ్ బాల్కనీ ఉంది.

నాకు మేకప్ వేసుకోవడం నచ్చదని నా దగ్గర ఒక్క మేకప్ కిట్ కూడా ఉండదని శ్యామల చెప్పుకొచ్చారు.మేకప్ మేన్ దగ్గరే నా మేకప్ సామాగ్రి ఉంటాయని ఆమె కామెంట్లు చేశారు.

తన ఇంటికి లిఫ్ట్ ఉందని చెబుతూ శ్యామల ఆ లిఫ్ట్ ను కూడా చూపించారు.

ఇంటిపైన సోలార్ ప్యానల్ ను పెట్టామని ఆమె చెప్పుకొచ్చారు.శ్యామల చేసిన వీడియోకు నాలుగున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.వైట్, గ్రే కలర్స్ లో ఉండేలా ఇంటిని నిర్మించుకున్నామని శ్యామల కామెంట్లు చేశారు.

ఇల్లంతా బ్రాంజ్ డెకార్ ఉంటుందని ఆమె తెలిపారు.శ్యామల సినిమాలు, టీవీ షోల ద్వారా భారీగానే సంపాదించారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube