ప్రభుత్వ ఆసుపత్రులంటే ఇప్పటికీ రోగులకే కాదు, వాళ్లకు సంబంధించిన కుటుంబ సభ్యులకూ భయమే.ఉచితంగా చేసే వైద్యం, వికటించినా, అడిగే నాదుడు కరువైయ్యాడు అనే ఆందోళన ప్రజల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఒకవేళ అడిగినా సమాధానం దొరకదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది.అందుకే అప్పు చేసైనా, .లేదా ఉన్న ఆస్తులు అమ్ముకునైనా ప్రైవేటు దవాఖానాలే బెటర్ అనే అభిప్రాయానికి ఫిక్సైపోయారు జనాలు.సర్కారు దవాఖానా అంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అడ్మిట్ అవ్వడమే.
ఇది గత నాలుగు, లేదా ఐదు దశాబ్దాల క్రితం నుండి వస్తున్న ఆచారం, తమ జీతాలు తమకు ఎలానూ వస్తాయి, ఇక ఇక్కడ డ్యూటీ చేయడం బదులు ప్రైవేటుగా డిస్పెన్సరీని నడుపుకుంటే పోలే.అనేది, నారాయణుడు లాంటి వైద్యుడు రాక్షస ఆలోచనలు చేసాడు.
ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉరు చివర ఉండే భూత్ బంగ్లాలా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు.రోగులపై వైద్యులకే కాదు, వారికింద పనిచేసే నర్సులకు, చివరకు కంపౌండర్లకూ చులకన భావమే ఉందనేది నగ్న సత్యం.
పేషెంట్ ఆసుపత్రికి వచ్చింది మొదలు.స్ట్రెచర్ పైన ఎక్కితే ఒక రేటు, ఆపరేషన్ చేయాలంటే ఒకరేటు.
చివరకు బల్లకింది బిల్లులు మాదిరిగా మారిపోయిన ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయింది.
తాజాగా ఇటీవల జరిగిన ఓ సంఘటనలో.
ప్రసవానికి వచ్చిన మహిళకు నొప్పుల ఇంజక్షన్ ఇచ్చి, వైద్యులంతా ఓ పార్టీలో పాల్గొన్న ఘటన తీవ్ర సంచలనం రేపింది.తీరా నొప్పులు మొదలైనా పార్టీలో ఉన్న వైద్యులు ఎవరూ స్పందించక పోవడంతో ఆ తల్లి, బిడ్డలు అనంతలోకాలకు వెళ్లిపోయారు.
మరో ఘటనలో చనిపోయిన శవాలను పదిలంగా భద్రపరచాల్సిన బ్రాండెడ్ ఆసుపత్రులు, మార్చురీలో ఏదో మూలకు విసిరేస్తే.తెల్లవార్లు ఆ శవాలను ఎలుకలు పీక్కు తిన్న ఘటన ఇంకా గుర్తుండే ఉంటుంది.
ఈలాంటి ఘోర ఘటనలు ఒకటికాదు, రెండు కాదు.తలచుకుంటే లెక్కకు మించిన సంఘటనలు హృదయ విదారకంగా వినిపిస్తాయి, కనిపిస్తాయి.
పబ్లిక్ ఆసుపత్రికి వెళితే సరైన వైద్యమందక, ప్రైవేటు ఆసుపత్రికి వెళితే .అవసరం లేని ప్రిస్కిప్షన్స్ తో చాంతాడంత బిల్లులు వేస్తున్న వైద్యులు.ఏంచేయాలో అర్ధం కాక మధ్యలోనే రాలిపోతున్న సాధారణ, పేదరిక పేషెంట్లు.వెరసి వైద్యో నారాయణో హరి అనే పేరుకు అర్ధమే మారిపోయింది.ఈ పరిస్థితులను మార్చడానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు నడుం బిగించినా, ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయనడంలో సందేహంలేదు.

తాజాగా ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న అపవాదులను తొలిగించే ప్రయత్నంలో భాగంగా సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం లోని ప్రభుత్వాసుపత్రిలో ఒరిజినల్ నారాయణుడిగా మారారు వైద్యులు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు మార్గదర్శకంగా మారుతుంది.18 కోట్ల 50 లక్షల రూపాయలను వెచ్చించి నిర్మించిన వంద పడకల ఆసుపత్రి ఇపుడు ఎలాంటి రోగులకైనా.‘నేనున్నాను’ అంటూ భరోసా కల్పిస్తుంది.ప్రస్తుతం ఈ ఆసుపత్రి లో నిరుపేద కుటుంబాలకు వైద్యం అందుబాటులో ఉంటుంది.ఆధునాతనమైన ఎక్స్ రే థియేటర్ తో పాటు ల్యాబ్ ఎమర్జెన్సీ వార్డ్స్, టీబీ వార్డ్స్, పిల్లల వార్డులు ప్రత్యేకంగా ఆధునీకరించబడ్డాయి.ప్రతీ ఆపరేషన్ కు సంబందించిన స్పెషల్ వార్డులతోపాటు 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు.
దాంతో నిరుపేదలకు ఇక్కడ వైద్యం అందించే వైద్యులపైనా పూర్తి భరోసా ఏర్పడింది.తాజాగా ఆసుపత్రి సూపరిన్టెన్డెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ బృందం ఆధ్వర్యంలో పది అరుదైన సర్జరీలు చేసి విజయం సాధించారు.
దాంతో పేద వర్గానికి చెందిన వారితోపాటు, డబ్బులు ఉన్నావారు కూడా ఈ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.
మరోవైపు ఈ ఆసుపత్రిలో పని చేయండంపై వైద్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్ది రోజుల వ్యవధిలోనే అరుదైన ఆపరేషన్లు చేసామన్నారు ఆసుపత్రి సూపరిన్టెన్డెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్.అందుకు సిబ్బంది నుంచి మంచి సహకారం కూడా లభిస్తుందని ఆనందం వ్యక్తం చేసారు.
విలువైన వైద్యం అందుబాటులో లేని పేదలకు సేవచేయండలో నిజమైన ఆనందాన్ని పోందుతున్నామన్నారు.
.







