ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.బీజేపీ ఢిల్లీ పెద్దలతో భేటి తర్వాత నల్లగొండలో కోటిరెడ్డి బ్రదర్స్ మధ్య వార్ తప్పేలా లేదు అంటున్నారు.
ఉప ఎన్నిక అనివార్యమైతే తమ్ముడిపై అన్ననే ఆయుధంగా మలచాలని ఏఐసీసీ చూస్తోందా.దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య దూరం పెరగనుందా.
అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.రాజగోపాల్ రెడ్డి ఎప్పటినుంచో బీజేపీని తలుచుకుంటున్నా రీసెంట్ గా జరిగిన భేటితో కమలం కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరందుకుంది.
ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నిక తప్పదని గులాబీ బాస్ సైతం మునుగోడుపై ఫోకస్ పెట్టినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా తథ్యం అయితే బిజేపీ నుంచి బరిలోకి దిగుతాడు.
అయితే కాంగ్రెస్ నుంచి తమ్ముడికి చెక్ పెట్టేలా అన్ని బాధ్యతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.ఇదే జరిగితే తమ్ముడిపై అన్న ఎదురు తిరగాల్సిందే.
అయితే కొన్ని రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య సఖ్యత కొరవడిందని అంటున్నారు.అన్న ద్వారానే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్న రాజగోపాలరెడ్డి ఇపుడు అన్నకే ఎసరు పెట్టేలా వ్యవహరిస్తున్నారని అభిప్రయాపడుతున్నారు.
తనకు పీసీసీ అధ్యక్ష పదవి రాకపోవడానికి కారణం కూడా తమ్ముడి ప్రవర్తన.అధిష్ఠానం దూతలపై అభ్యంతరకర వ్యాఖ్యల ఫలితమేననే అనుమానాలు ఇప్పటికీ వెంకటరెడ్డిని వెంటాడుతూనే ఉన్నాయి.
ఆ చికాకులో భాగంగానే రేవంత్ పై కోమటి రెడ్డి కూడా అసమ్మతి గళం వినిపించారు.ఇక ఇప్పుడు తన తమ్ముడి రాజీనామా ఆపలేకపోతే అది తన మెడకే చుట్టుకొనే ప్రమాదం ఉంది.
ఎందుకంటే నల్లగొండ అంటే కాంగ్రెస్ కంచుకోట అనే భావన ఇన్నాళ్లూ అందిరిలోనూ ఉంది.ఇప్పుడు తమ్ముడి ప్రవర్తనతో వెంకటరెడ్డి తొలిసారి ఇరకాటంలో పడినట్లు అయింది.
బాధ్యతలు తన నెత్తిపైనే వేస్తే.
వెంకట్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన వ్యక్తి.ప్రస్తుతం స్టార్ క్యాంపెయినర్ హోదాలో ఉన్న వ్యక్తి.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కీలక పదవిని ఆశిస్తున్న వ్యక్తి.ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఆషామాషీగా తీసుకోవడానికి వీలు లేదు.తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే మాదిరిగా ఎదురుతిరగాలస్సిందే.
అభ్యర్థి ఎంపిక.ప్రచారం.
గెలుపు బాధ్యతలు అన్ని అన్న నెత్తిపైనే పడతాయనేది పార్టీలో వర్గాల్లో చర్చ.దీంతో కోమటి రెడ్డి వెంకట రెడ్డి తొలిసారి మధనపడుతున్నట్లుగా తెలుస్తోంది.
రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే గనక వచ్చే ఉప ఎన్నిక బాధ్యత అన్న వెంకట్ రెడ్డిపై పెట్టాలని అధిష్ఠానం యోచనలో ఉందట.ఇదే జరిగితే తమ్ముడిపై పోరాటం తప్పదు ఇక.

ఎందుకంటే కాంగ్రెస్ కంచుకోటలోకి బీజేపీ అడుగుపెడితే అది అన్ననే మింగేసే వరకు వెళ్తుంది.అయతే ఈ ప్రమాదం తన తమ్ముడి రూపంలో వస్తుండడం దూరంగా ఉండే ప్రసక్తే లేదు.అందుకే బీజేపీని ఆపాలంటే తన తమ్ముడినే ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైతే ఏఐసీసీ నల్లగొండ జిల్లా కీలక నేతలందరినీ సమాయత్తం చేయాలని యోచిస్తోంది కాంగ్రెస్.
కోమటి రెడ్డి వెంకటరెడ్డితో పాటు మాజీ మంత్రులు ఉత్తం, దామోదర్ రెడ్డి, జానారెడ్డి తదితర సీనియర్లకు తలా ఒక మండలం బాధ్యతను అప్పగించి కంచుకోటలోకి కాషాయం జెండా రాకుండా అడ్డుకోవాలని పట్టుదలతో ఉందట.అయితే ఇదంతా టీపీసీసీ సూచన మేరకు ఏఐసీసీ ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
మరి దీనిపై వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్పిందే.







