సినిమా ఇండస్ట్రీలో కథకు అనుగుణంగా లుక్ ను మార్చుకునే హీరోలలో తారక్ ముందువరసలో ఉంటారు.సినిమాకు అవసరమైతే బరువు పెరిగే తారక్ కొన్ని సందర్భాల్లో బరువు తగ్గి కూడా అభిమానులకు షాకిచ్చారు.
కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గుతున్నట్టు కొన్ని నెలల క్రితం తారక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా అభిమానితో కలిసి దిగిన ఫోటోలో తారక్ బొద్దుగానే కనిపించారని ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
సెప్టెంబర్ నుంచి కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ మొదలుకానున్న నేపథ్యంలో తారక్ బరువు తగ్గడంపై శ్రద్ధ పెట్టడం లేదని ప్రచారం జరుగుతోంది.అయితే తారక్ స్పందించి షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తారక్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ త్వరగా మొదలైతే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
ఎన్టీఅర్ లుక్ తారక్ పాత సినిమాలను గుర్తుకు తెచ్చే విధంగా ఉందని కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
కానీ వాస్తవం ఏమిటంటే ఆ ఫోటో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఇప్పటి ఫోటో అయితే కాదు.కొంతమంది కావాలని ఈ ఫోటోను వైరల్ చేస్తూ తారక్ గురించి నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు.
బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ గెస్ట్ గా హాజరు కానున్నారు.

ఈ ఈవెంట్ లో తారక్ లుక్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.బింబిసార ఈవెంట్ కు తారక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా తారక్ సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులను కోరుకుంటున్నారు.
సినిమాసినిమాకు తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.బింబిసార సక్సెస్ కోసం తారక్ తన వంతు సహాయం చేస్తున్నారు.







