'సీతా రామం'కు గెస్ట్ డార్లింగ్ కాదట.. యంగ్ టైగర్ ను లైన్లో పెట్టిన టీమ్!

వచ్చే ఆగష్టు నెలలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.ఈ నెల మొత్తం కూడా పెద్ద సినిమాల నుండి మీడియం రేంజ్ చిన్న సినిమాలు మొత్తం కూడా వరుసగా రిలీజ్ డేట్స్ ప్రకటించారు.

 Ntr To Grace Sita Ramam Pre-release Event, Dulquer Salmaan, Sumanth, Hanu Raghav-TeluguStop.com

మరి రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల్లో హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు.ఈయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా సీతా రామం.ఈ సినిమా నుండి నిన్న ట్రైలర్ రిలీజ్ అయ్యి బాగా ఆకట్టుకుంది.

యుద్ధం నేపథ్యంలో అందమైన ప్రేమ కథను మరింత ఎమోషనల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించారు.

ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఏకకాలంలో నిర్మించారు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఆగష్టు 5న థియేటర్స్ లోకి రావడానికి సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రొమోషన్స్ ను స్టార్ట్ చేసారు.ఈ క్రమంలోనే నిన్న ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసి మరిన్ని అంచనాలను పెంచేశారు.ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.మరి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోతున్నాడు అని కామెంట్స్ వినిపించాయి.

Telugu Dulquer Salmaan, Mrunal Thakur, Ntrgrace, Prabhas, Sita Ramam, Sita Ramam

కానీ ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం డార్లింగ్ కాదు మరొక పాన్ ఇండియా స్టార్ రాబోతున్నాడు అంటూ ఇప్పుడు కథనాలు వస్తున్నాయి.ఆయన మరెవరో కాదు.ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోల లిష్టులోకి చేరిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని ఇప్పుడు తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ఈయన వస్తున్నాడు అనే వార్త విని నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇది నిజం అవ్వాలని కోరుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ఆమె ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో గౌతమ్ మీనన్, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్, సమంత, వెన్నెల కిషోర్, మురళీ శర్మ వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు.

మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube