ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన ఇందు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.చిన్న వయస్సులోనే భర్త చనిపోయాడని చైల్డ్ కు బ్రెయిన్ ఫీవర్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.
అమ్మ చాలా ప్రాక్టికల్ ఉమన్ అని ఇందు తెలిపారు.సింగిల్ మదర్ గా ప్రతిరోజూ ఛాలెంజ్ అని ఆమె పేర్కొన్నారు.
టెక్నాలజీ వల్ల కొన్ని సమస్యలు తగ్గాయని ఆమె అన్నారు.
ప్రతిరోజూ ఛాలెంజ్ అని కుకింగ్ మాత్రం ఎప్పుడూ నేనే చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
నా ఫ్రెండ్ రేఖ ఒక బ్యూటీపార్లర్ ఓపెన్ చేసిందని తను నా హెయిర్ స్టైల్ చేసిందని ఆ ఫోటో ఇప్పటికీ తన షాప్ లో ఉంటుందని ఆమె అన్నారు.బొంబాయి ప్రియుడు సినిమాతో తన సినీ కెరీర్ మొదలైందని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పానని ఇందు కామెంట్లు చేశారు.
అప్పట్లో నాకు తెలుగు రాదని అందువల్ల డైలాగ్స్ చెప్పడం కూడా కష్టంగానే అనిపించేదని ఆమె చెప్పుకొచ్చారు.

బద్రి సినిమాలో రేణు దేశాయ్ ను నేను కొడతనాని ఆ సినిమాలను ఇప్పుడు చేసుకుంటే నేను కరెక్ట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చానని అనిపిస్తుందని ఇందు కామెంట్లు చేశారు.పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ నేను ఒక యాడ్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.టాటా సెల్యులర్ యాడ్ లో నేను నటించానని ఆమె కామెంట్లు చేశారు.

ఖుషి మూవీలో డాక్టర్ రోల్ లో చేశానని ఆమె చెప్పుకొచ్చారు.ఖుషి షూట్ కు వెళ్లిన సమయంలో పవన్, రేణు దేశాయ్ అక్కడ ఉన్నారని నేను వాళ్లిద్దరినీ చూసి షాకై మీరిద్దరూ ఇక్కడెందుకు ఉన్నారు అని అడిగానని ఆమె చెప్పుకొచ్చారు.వీ ఆర్ స్టేయింగ్ టుగెదర్ అని వాళ్లు నాతో చెప్పారని ఇందు చెప్పుకొచ్చారు.
అవునా అని నేను అన్నానని ఇందు కామెంట్లు చేశారు.పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పర్సన్ అని ఇందు పేర్కొన్నారు.







