కాఫర్ డ్యామ్ పూర్తిచేయకుండా ఎవరైనా డయాఫ్రమ్ వాల్ కడతారా..? :మంత్రి అంబటి రాంబాబు

పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి గత ప్రభుత్వ నిర్ణయాలే కాzరణమని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.గత ప్రభుత్వం ట్రాన్స్ ట్రాయ్ ని తొలగించి అనే సంస్థకు నామినేషన్ పద్దతిలోనే పనులు అప్పగించిందని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి 12.6 శాతం ఆదా చేశామని తెలిపారు.గత ప్రభుత్వం పునరావాసం పూర్తి చేయకుండా, 35వ కాంటూరు పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయకుండా హడావుడిగా పనులు చేపట్టడం వల్లే ప్రాజెక్టు నిర్మాణం ఆలశ్యమవుతోందని పోలవరం ప్రాజెక్టు మ్యాప్ లో చూపిస్తూ వివరించారు.

 Minister Ambati Rambabu On Polavaram Diaphragm Wall,minister Ambati Rambabu,pola-TeluguStop.com

ఐఐటీ హైదరాబాద్‌ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాలు గత ప్రభుత్వాన్ని ఉద్దేశించినవేనని మంత్రి ప్రత్యారోపణ చేసారు.

పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి గత ప్రభుత్వం అసమర్థతతే కారణమని విమర్శించారు.

విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.మరోవైపు ప్రతిపక్ష నేత వరదల్లోనూ బురద రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

వరద బాధితులు ఇబ్బందులు పడుతుంటే.ఎవరైనా పార్టీ జెండాలతో, కార్యకర్తలతో రాజకీయాలు చేస్తారా.? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లేందుకే ఆరోపణలు చేస్తున్నారన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ముఖ్యమంత్రి పర్యటిస్తారని, బాధితులను పరామర్శించి అండగా నిలుస్తారని తెలిపారు., బాధితుల సమస్యలు, ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుని బాధితులకు భరోసా కల్పిస్తారని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… పోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ప్రాజెక్టు పాలిట శాపాలుగా మారాయని ఆరోపించారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టర్‌ను మార్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యవహరించిందని ట్రాన్స్‌ ట్రాయ్‌ నుంచి పనులు నవయుగ సంస్థకు అప్పగించిన సమయంలో గత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు.

కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేసిన తర్వాత డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా గత ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు స్వీయ లబ్ది కోసం అన్ని పనుల్ని ఏకకాలంలో చేపట్టారని ఆరోపించారు.పోలవరం నిర్మాణంలో భాగంగా కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణాన్ని ప్రారంభించిన పూర్తి చేయలేదన్నారు.

అదే సమయంలో 35వ కాంటూరులో కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ముంపు మండలాల్లోని 45 గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మొరపెట్టుకున్నాయన్నారు.పోలవరం బ్యాక్‌ వాటర్‌లో 60 గ్రామాలు ఉంటే 15 గ్రామాలను మాత్రమే ఖాళీ చేయించారని ఫలితంగా కాఫర్‌ డ్యామ్ పనుల్ని నిలిపి వేసిన విషయాన్ని గుర్తు చేశారు.

పోలవరం ఎర్త్‌ కం రాక్‌ ఫిల్ డ్యామ్‌లో భాగంగా డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపట్టడానికి ముందే అప్పర్, లోయర్ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేసి ఉండాల్సిందన్నారు.పోలవరం ప్రాజెక్టులో గోదావరి జలాలను స్పిల్‌ వే మీదకు మళ్లించే పనులు కూడా గత ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు.

గోదావరి నీరు వచ్చే అప్రోచ్ ఛానల్ పనులు కూడా పూర్తి కాలేదని, స్పిల్‌ వే, స్పిల్ ఛానల్ పనులు తమ ప్రభుత్వం వచ్చాక పూర్తి చేశామన్నారు.పోలవరం భూ నిర్వాసితులకు పునరావాసం కోసం గత ప్రభుత్వం దాదాపు 200 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.ఈ ప్రభుత్వంలో రూ.1500 కోట్లు ఖర్చు చేశామన్నారు.పోలవరం నిర్మాణం ప్రణాళికబద్దంగా పునరావాసం పూర్తి చేసి జరగాల్సి ఉండగా లబ్ది కలిగే పనులు ముందు చేపట్టి గత ప్రభుత్వం ప్రజల్ని విస్మరించిందని తెలిపారు.కాఫ‌ర్ డ్యామ్ పూర్తి చేయ‌కుండా డ‌యాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తారా? అని మంత్రి అంబటి నిల‌దీశారు.డాక్టర్ వైఎస్సార్ ప్రారంభించిన, కలలు కన్న పోలరవం ప్రాజెక్టును మా ప్రభుత్వం పూర్తి చేయాలనే తపనతో, చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి తెలిపారు.సెక్రటరీలు, మంత్రులును మారిస్తే ప్రాజెక్టులు కొట్టుకుపోతాయా.? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube