సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రమేష్, ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్.
రామ్ ప్రసాద్.ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్ల సమస్యలపై సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసాము.
వాటిని హైదరాబాద్ లోని నిర్మాతల సంఘానికి తెలియజేస్తాము.ott ల వల్ల థియేటర్లు నష్టపోతున్నాయి.
ott ల వల్ల థియేటర్లకు జనం తగ్గుతున్నారు.సినిమా విడుదలైన తర్వాత 8 వారాలకు పెద్ద సినిమా, 4 వారాలకు చిన్న సినిమా వేసుకోవాలని మేము సూచించాము.
డిజిటల్ చార్జీలు ఇంతకు ముందు ఎవరు కట్టారో వాళ్లే కట్టే విధంగా తీర్మానం చేసాము.
సినిమా కలెక్షన్స్ విషయంలో తప్పుడు లెక్కలు చూపడం వల్ల హీరోలు బాగుపడుతున్నారు.
మల్టీప్లెక్స్ లలో క్యాంటీన్ ధరలు వల్ల సినిమా చూసేవాళ్ళకి ఖర్చు పెరుగుతోంది.సింగిల్ స్క్రీన్స్ లలో ఈ భారం ఉండదు.
అందుకే థియేటర్ వ్యవస్థను కాపాడాలి.హిందీ లో నిర్మాతలే డిజిటల్ ఖర్చులు భారాయిస్తారు.
తమిళనాడులో డిజిటల్ ఖర్చు నాలుగు వేల మాత్రమే.కానీ మన ఏపీలో 12500 ఉంది.
ఇది తగ్గించాలి.ఇది నిర్మాతలే భరాయించాలి అని తీర్మానించాము.
ఆచార్య, RRR వంటి పెద్ద సినిమాల వల్ల కూడా మేము ఇబ్బంది పడ్డాము.
రెంటల్ విధానం కూడా మార్పు చేయాలని నిర్మాతలను కోరాము.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు విక్రయించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.సామాన్యులకు అందుబాటులో థియేటర్ వ్యవస్థను ఇండస్ట్రీ పెద్దలే కాపాడాలి.