న్యూస్ రౌండప్ టాప్ 20

1.కెసిఆర్ పై పోటీ చేస్తా : ఈటెల రాజేందర్

బిజెపి అధిష్టానం ఆదేశిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని బిజెపి హుజూరాబాద్ ఎమ్మెల్యే రాజేందర్ అన్నారు.

 

2.కెసిఆర్ పై షర్మిల కామెంట్స్

  కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఏం సాధించారు అంటూ టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు. 

3.కెసిఆర్ పై తెలంగాణ గవర్నర్ ఆగ్రహం

 

తెలంగాణ సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కనీసం ప్రోటోకాల్ పాటించకుండా కక్షపూరితంగా కేసిఆర్ వ్యవహరిస్తున్నారని తమిళ సై మండిపడ్డారు. 

4.నేడు హస్తినకు కేసిఆర్

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం పార్టీ ఎంపీలు , మంత్రులతో ఢిల్లీకి వెళ్లనున్నారు. 

5.శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్

 

ఈరోజు భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ద్రౌపది ముర్ము కు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. 

6.విదేశీ విద్యా పథకంపై హైకోర్టులో విచారణ

  విదేశీ విద్యా పథకంపై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ పథకాన్ని మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం నిలిపివేసిందంటూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున షిబ్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

7.ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ విమర్శలు

 

Advertisement

ఏపీలో భారీగా వరద నష్టం చోటు చేసుకున్నా,  ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ విమర్శించారు. 

8.జగన్ క్షమాపణలు చెప్పాలి : సీపీఐ

  పోలవరం నిర్వాసితులకు ఏపీ సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. 

9.అనంతపురంలో చిరుత పులి కలకలం

 

అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లి గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. 

10.చిరుత పులి సంచారం పై హెచ్చరిక

  కర్నూలు జిల్లాలోని రాంపల్లి, ఇందిరాంపల్లి తదితర గ్రామాల చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

11.తెలంగాణలో కలపాలంటూ ధర్నా

  ఏపీలోని అల్లూరు జిల్లా యాటపాక మండలంలోని ఐదు పంచాయతీల ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 

12.హరీష్ రావు కీలక ఆదేశాలు

  తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభించక ముందే ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు , వైద్య అధికారులకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. 

13.బిజెపి పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని భేటీ

 

బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు.మరింత మెరుగ్గా పనిచేయాలని సూచించారు. 

14.రాజాసింగ్ పై బోధన్ ఎమ్మెల్యే విమర్శలు

  గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై బోధన్ ఎమ్మెల్యే షకీల్ విమర్శలు చేశారు.తెలంగాణ అభివృద్ధిపై రాజాసింగ్ కు ఏమాత్రం అవగాహన లేదని ఆయన విమర్శించారు. 

15.సుభాష్ పత్రీజీ మృతి

 

ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిక అనారోగ్యంతో కన్నుమూశారు. 

16.కామారెడ్డి జిల్లాలో మంకీ పాక్స్ కలకలం

  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీ ఫాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.ఈనెల ఆరో తేదీన అతడు కువైట్ నుంచి ఇండియాకు వచ్చినట్లు సమాచారం. 

17.రాజగోపాల్ రెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శలు

 

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

2018 తర్వాత మునుగోడులో అభివృద్ధి కుంటుపడిందని, దీనికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. 

18.విశాఖకు పరిపాలన రాజధాని ఖాయం

  విశాఖకు పరిపాలన రాజధాని రావడం ఖాయమని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అన్నారు. 

19.ఏపీ పాలీసెట్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

 

Advertisement

ఏపీ వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,900   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,160.

తాజా వార్తలు