బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం మీడియా పాయింట్స్ విజయవాడ విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతన రాష్ట్రపతి గా చిన్న వయసులో ఎంపికైన ద్రౌపది ముర్ము కి ఎపి బిజెపి తరపున శుభాభినందనలు ఈరోజు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఎపి బిజెపి శాఖ తరపున అన్ని ప్రాంతాల్లో కూడా విజయోత్సవాలు నిర్వహించాం వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోలేదు ఇదే బిజెపి ప్రతినిధులు పర్యటనల్లో తేలింది 215 గ్రామాలు వరదలో చిక్కుకోగా 70వేల మంది కట్టు బట్టలతో బయటకు వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మాటలకు, చేతలకు సంబంధం లేదు ముంపు ప్రాంతాల బాధితులను గాలికొదిలేశారు జగన్ మాత్రం గాలిలోనే తిరుగుతున్నారు.పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ లోని ఏడు మండలాలను ఎపిలో కలిపారు వారు తెలంగాణా కు వెళ్లిపోతాం అన్నారంటే జగన్ సిగ్గు పడాలి త్యాగాలు చేసిన కుటుంబాలు ను పట్టించుకోక పోవడం దుర్మార్గం.
ప్రజల పై జగన్ కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధం అవుతుంది ఎపి లో ప్రజలను జగన్ ప్రభుత్వం మనుషులుగా చూడటం లేదు అధికారులు కూడా కనీసం తమ వద్దకు రాలేదని బాధితులు చెబుతున్నారు జగన్ విలాస వంతమైన భవనము లొ ఉంటారు అందరూ అలాగే ఉంటారనుకోవడం జగన్ భ్రమ ఇటీవల మీ ఎమ్మెల్యే ముక్కు మూసుకుని పది నిమిషాలు ఉండలేక పోయారు అక్కడ ప్రజలు 12 రోజులుగా ఎలా ఉంటున్నారో ఆలోచన చేయండి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అయితే బటన్ నొక్కుతారా లక్షల మందికి డబ్బులు ఇచ్చామని గణాంకాలు చెబుతారు 75వేల మంది వరద బాధితులు లెక్కలు మీ దగ్గర లేవా వాలంటీర్ లు, వైద్య బృందాలు, ప్రభుత్వ సిబ్బందిని ఎందుకు పంపలేదు2వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరి పోతుందా ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో, అధికార పార్టీ ప్యాలెస్ లో ఉంటుంది.
విపక్ష పార్టీ ల నేతలు చెబితే అధికారులు వింటారా చెవిటోడి చెవిలో శంఖం ఊదిన చందాన ప్రభుత్వం తీరు ఉంది పది రోజుల తరువాత జగన్ పర్యటనతో ఏం చెబుతారు ఒక మంత్రి జనం దగ్గరకు వెళ్లి శిక్షణ ఇస్తారా అంతా బాగుందని , గొప్పగా చేశారని జగన్ కు చెప్పాలా.
సిఎం గారూ… మహిళల బాధలు ఒక్కసారి చూడండి వరద ప్రాంతాలలో బిజెపి నేతలు, కార్యకర్తలు పర్యటించారు వరద ప్రాంతాలలో మహిళల మనోవేదన వీడియో లను మీడియా కు చూపించిన విష్ణు వర్ధన్ రెడ్డి 11రోజులుగా తిండి లేదు, గూడు లేదని ఆవేదన చెందుతున్నారు ఇంత నిర్లక్ష్యం తో ఉన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు ప్రజల సొమ్ముతో, పన్నుతో బతుకుతూ… వారి బతుకులను బజారు పాలు చేస్తారా 215 గ్రామాలు వరదలో చిక్కుకోగా 70వేల మంది కట్టు బట్టలతో బయటకు వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మాటలకు, చేతలకు సంబంధం లేదు ముంపు ప్రాంతాల బాధితులను గాలికొదిలేశారు జగన్ మాత్రం గాలిలోనే తిరుగుతున్నారు పాఠశాలల విలీనం పై విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్ఎపి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు కు శాపంగా మారాయి.
ప్రణాళిక లేకుండా స్కూళ్లు మూసేస్తారా మూడు కిలో మీటర్లు వెళ్లి పిల్లలు చదువుకుంటారా ఒకే గదిలో మూడు తరగతుల పిల్లలకు ఫాఠాలా ఇవి వెలుగులోకి తెస్తే అన్యాయంగా కేసులు పెడతారా వార్తలు రాయడం విలేకరుల విధి… కుట్రతో కేసు పెట్టిస్తారా సమస్య ను పరిష్కారించే బాధ్యత ప్రభుత్వం పై లేదా ఈ కేసులను వెంటనే ఉప సంహరించు కోవాలి దేశం మొత్తం జాతీయ విద్యా విధానం అమలు అవుతుంది.
జగన్ ఎడ్యుకేషన్ పాలసీని మాత్రమే ఎపిలో అమలు చేస్తున్నారు జగన్ రివర్స్ పాలన కు ఇది పెద్ద ఉదాహరణ పేదలకు విద్య ను దూరం చేసే కుట్రతో ఇదంతా చేస్తున్నారు.అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో అవకాశం ఇస్తున్నాయి జగన్ మాత్రమే జాతీయ విద్యా విధానం ముసుగులో విద్యార్థులు కు అన్యాయం చేస్తున్నారు విదేశాల్లో కోట్లు పెట్టి మీ పిల్లలను చదివిస్తారు కూటి కోసం కష్టపడే పేదల పాట్లు మీకు అర్ధం కావు బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో యువ సంఘర్షణ యాత్ర చేపడుతుంది.
ఆగష్టు 2నుండి ఈ యాత్ర ద్వారా జగన్ మోసాలను వివరిస్తాం ఈ యేడాది పాఠశాలల విలీన ప్రక్రియ ను ఆపాలి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన ను అర్ధం చేసుకోవాలి జాతీయ విద్యా విధాన వ్యతిరేక చర్యలు పై బిజెపి పోరాటం చేస్తుంది పేదలకు బియ్యం ఇప్పించిన విధంగా… విద్యా విధానంలో కూడా మార్పు తెప్పిస్తాం వైసిపి వైఫల్యాల పై బిజెపి ఉద్యమ కార్యాచరణ తీ ముందుకు వెళతాం.







