భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిలోకసుందరిగా వెలిగిన హీరోయిన్ ఎవరూ అంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరూ చెప్పే పేరు శ్రీదేవి అని.ఆమె అభిమానులకు భౌతికంగా దూరమైన ప్రేక్షకుల మదిలో మాత్రం ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి.
అందం అభినయానికి మారుపేరుగా నటనకు నిలువెత్తు రూపంగా శ్రీదేవి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక అగ్రతారగా వెలుగొండింది.హీరోలు కేవలం ఒకే భాషకు పరిమితమై సినిమాలు చేస్తున్న సమయంలో భాషా పరిమితి లేకుండా అన్ని భాషల్లో కూడా స్టార్ హీరోయిన్గా వెలుగొంది తిరుగులేదు అని నిరూపించారు అతిలోక సుందరి శ్రీదేవి.
అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మహా నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ ఎన్టీఆర్ తో శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించారు అన్న విషయం తెలిసిందే.ఇక వీరిద్దరి కాంబినేషన్ అప్పట్లో ప్రేక్షకులకు ఫేవరెట్గా కూడా మారిపోయింది.
దీంతో శ్రీదేవి ఎన్టీఆర్ హీరోహీరోయిన్లుగా సినిమా వచ్చిందంటే చాలు అది సూపర్ హిట్ అవ్వడం ఖాయం కానీ ప్రేక్షకులు నమ్మేవారు.అయితే ఎన్టీఆర్ తన సరసన నటించిన ఎంతోమంది హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో ఎలా మెలగాలి ఎలా ఉండాలి అనే విషయాలను చెబుతూ ఉండేవారు.

అయితే శ్రీదేవి ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించడానికి ముందే చైల్డ్ ఆర్టిస్టుగా కూడా సినిమాల్లో నటించింది.ముఖ్యంగా బాల భారతం సినిమా నుంచి శ్రీదేవి కి ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఏర్పడింది అని చెప్పాలి.ఇక ఆ తర్వాత నేరుగా ఎన్టీఆర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ఇక బడిపంతులు అనే సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి శ్రీదేవి నటించిన సమయంలో శ్రీదేవి నటన చూసి ఎన్టీఆర్ ఫిదా అయ్యాడట.

శ్రీదేవి జాతకం తీసుకుని పండితులకు ఆమె జాతకాన్ని చూపించారట ఎన్టీఆర్.కేవలం కొంతమందికి మాత్రమే జాతకం చెప్పే విఠలాచార్య ఎన్టీఆర్ మీద అభిమానంతో శ్రీదేవి జాతకం చూసారట.ఈ పాప దేశానికి పెద్ద హీరోయిన్ అవుతుందని విఠలాచార్య అప్పట్లో అన్న గారితో అన్నారట.ఇక అన్నగారు ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పడంతో శ్రీదేవి డేట్లు ఒక్కసారిగా బిజీ అయిపోయాయ్ అన్నగారు చెప్పినట్టుగానే ఆమె పాన్ ఇండియా హీరోయిన్గా అప్పట్లో హవా నడిపించింది.
అయితే ఇదే విటలాచార్య కృష్ణ సూపర్ స్టార్ అవుతారని అన్నగారు రాజకీయాల్లోకి వస్తారని కూడా ముందుగానే చెప్పారు.







