మాస్ రాజా రవితేజ స్పీడ్ ఏ విధంగా ఉంటుందో అందరికి తెలుసు.ఎందుకంటే రవితేజ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.
రవితేజ ఎక్కువుగా తన కెరీర్ లో మాస్ సినిమాలతోనే హిట్స్ అందుకున్నాడు.కమర్షియల్ అంశాలతో పాటు మాస్ ప్రేక్షకులను మెప్పించే మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలా చూసుకుంటాడు.
అయితే రవితేజ ఎప్పుడు చేసే మాస్ మసాలా సినిమా కాకుండా కంటెంట్ పుష్కలంగా ఉన్న థ్రిల్లర్ మూవీ అని తెలుస్తుంది.కథ ప్రధానంగా సాగుతూ.రవితేజకు కలిసొచ్చే మాస్ ఎలిమెంట్స్ కూడా కొంతమేర యాడ్ అయినట్టు ఇటీవలే రిలీజ్ అయినా ట్రైలర్ చుస్తే తెలుస్తుంది.ఎప్పుడు చేసేలా ఇంట్రో సాంగ్.
ఒక ఫైట్.కొద్దిగా రొమాన్స్.
కాకుండా ఈసారి ఈ సినిమాకు కథే మెయిన్ హీరో అని అనిపిస్తుంది.
రవితేజ గత సినిమా క్రాక్ సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే.
ఆ వెంటనే ఖిలాడీ సినిమాతో వచ్చి బోల్తా పడ్డాడు.ఇక ఇప్పుడు ప్లాప్ తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్నాడు.
కొత్త దర్శకుడు శరత్ మండవ తో రవితేజ ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాను తీయడం అనేది సాహసం అనే చెప్పాలి.జులై 29న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుండి మరొక అప్డేట్ ను అందించారు మేకర్స్.ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకోనుంది అని మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.అంతేకాదు ఈ ఈవెంట్ కు గెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని రాబోతున్నారు.మరి ఈ ఇద్దరు హీరోల స్పీచ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇక ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రజిషా విజయన్, దివ్యంసా కౌశిక్ నటిస్తున్నారు.అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా.సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ సినిమా రవితేజ కెరీర్ లో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.







