మనం కాంబినేషన్ లో డైరక్టర్ విక్రం కె కుమార్, నాగ చైతన్య కలిసి చేసిన లేటెస్ట్ మూవీ థ్యాంక్యూ.దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.
ప్రచార చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న ఈ థ్యాంక్యూ మూవీ యూత్ ఆడియెన్స్ ని అలరిస్తుందని అనుకుంటే మొదటి షోకే సినిమాపై డివైడ్ టాక్ వచ్చేసింది.ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు కూడా చాలా తక్కువ వచ్చాయని తెలుస్తుంది.
కేవలం ఫస్ట్ డే 30% ఆక్యుపెన్సీ మాత్రమే వచ్చిందని తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకు ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడానికి కారణం మాత్రం ముందురోజు ప్రీమియర్స్ వేయడమే అని అంటున్నారు.
ఏపీలో కొన్నిచోట్ల థ్యాంక్యూ సినిమాని స్పెషల్ ప్రీమియర్స్ గా వేశారు.గురువారం రాత్రి ఆటకే థ్యాంక్యూ మూవీ టాక్ తెలిసిపోయింది.సినిమా చూసిన కొందరు సోషల్ మీడియాలో సినిమా రిజల్ట్ తేల్చేశారు.దానితో రిలీజ్ డేట్ న సినిమా చూద్దాం అనుకున్న ప్రేక్షకులు కూడా సినిమా చూడకుండా అయ్యింది.
ముందు రోజు ప్రీమియర్స్ వేయడం కొన్ని సినిమాలకు కలిసి వస్తుంది కానీ కొన్ని సినిమాలకు మాత్రం అది కలిసి రాదు.

బివిఎస్ రవి రొటీన్ స్టోరీ.ఎలాంటి మ్యాజిక్ లేని విక్రం కె కుమార్ డైరక్షన్ సినిమాని అంచనాలను అందుకోలేకపోయాయి.అందుకే సినిమా మీద డివైడ్ టాక్ వచ్చింది.
అదీగాక శుక్రవారం నాడు తెలంగాణాలో చాలా చోట్ల వర్షాలు పడ్డాయి.అది కూడా థ్యాంక్యూ కలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడేలా చేసింది.
మజిలీ నుంచి ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు వరకు వరుస హిట్లు అందుకున్న నాగ చైతన్య థ్యాంక్యూతో నిరాశపరచాడు.అయితే సినిమాలో నాగ చైతన్య నటన మాత్రం అందరిని మెప్పించింది.







