ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన బండ్ల గణేష్ పై పవన్, అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.అటు పవన్ తో ఇటు బన్నీతో బండ్ల గణేష్ సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే.
అయితే విజయ్ దేవరకొండ కామెంట్లకు కౌంటర్ గా తారక్, చరణ్, మహేష్, ప్రభాస్ పేర్లను ప్రస్తావిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేయడం గమనార్హం.అయితే పవన్, బన్నీ పేర్లను ప్రస్తావించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
కొన్నిరోజుల క్రితం వరకు పవన్ కళ్యాణ్ ను దేవుడిలా కొలిచిన వీరాభిమానులలో బండ్ల గణేష్ ఒకరు.అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.
అయితే పవన్ కు, బండ్ల గణేష్ కు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయో అభిమానులకు సైతం అర్థం కావడం లేదు.మరోవైపు బన్నీ బండ్ల గణేష్ కాంబినేషన్ లో ఇద్దరమ్మాయిలతో సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

బ్యాగ్రౌండ్ ఉన్నా పవన్, బన్నీ తమ టాలెంట్ తోనే ఊహించని స్థాయికి ఎదిగారు.బన్నీ, పవన్ లకు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది.వీళ్లిద్దరూ ఏం తప్పు చేశారని నెటిజన్ల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
తనకు నిర్మాతగా ఛాన్స్ ఇవ్వకపోవడం వల్లే బండ్ల గణేష్ ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బండ్ల గణేష్ అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు భావిస్తున్నారు.ఫ్యాన్స్ కు కోపం వచ్చేలా బండ్ల గణేష్ వ్యవహరిస్తే ఆయన కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.బండ్ల గణేష్ భవిష్యత్తులో మరిన్ని ఆఫర్లతో నిర్మాతగా బిజీ అవుతారో లేదో చూడాల్సి ఉంది.







