చాలా కామన్‌గా వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు ముందు వరసలో ఉంటాయి.అయితే ఒక్కోసారి మొటిమలు పోయినా వాటి తాలూకు మచ్చలు తగ్గనే తగ్గవు.
ఆ మచ్చలు ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.దాంతో మొటిమల తాలూకు మచ్చలను తగ్గించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలన్నీ ట్రై చేస్తుంటారు.అయినప్పటికీ ఆ మచ్చలు తగ్గకుంటే ఏం చేయాలో అర్థంగాక తెగ మదన పడిపోతూ ఉంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్‌ను వాడితే మొటిమల తాలూకు మచ్చలు సహజంగానే దూరం అవుతాయి.మరి ఇంకెందుకు లేటు ఆ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
ముందుగా ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి వాటర్‌తో కడిగి.ఒక కప్పు వాటర్ పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్‌తో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని.పల్చటి వస్త్రం సాయంతో రైస్ మిల్క్‌ను సపరేట్ చేసుకోవాలి.
అలాగే ఒక క్యారెట్‌ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రైస్ మిల్క్, క్యారెట్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి వేసుకుని ఉండలు లేకుండా కలిపి.దగ్గర పడే వరకు ఉడికించాలి.
ఇలా ఉడికించుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేస్తే క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్‌ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.రోజుకు రెండు సార్లు ఈ క్రీమ్‌ను మచ్చలపై అప్లై చేసుకోవాలి.ఇలా చేస్తే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.