అయ్యప్పనుమ్ కోషియం సినిమాతో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ సంపాదించుకున్నాడు సాచి అలియాస్ కేఆర్ సచ్చిదానందం.అయితే సాచికీ అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు గాను మరణాంతరం జాతీయ ఉత్తమ దర్శకుడిగా అవార్డు లభించింది.
అయితే సాచి కీ ఈ జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చినందుకు ఒకవైపు సంతోష పడాలో లేదంటే, ఆవేదనపడాలో అర్థం కాని పరిస్థితి.ఇది ఇలా ఉంటే తాజాగా ఇదే విషయం గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ట్వీట్ అభిమానుల బావోద్వేగానికి గురిచేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.సాచి మలయాళ సినీ ఇండస్ట్రీలో స్క్రీన్ రైటర్ గా,డైరెక్టర్ గా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.సాచి మొదట 2015లో వచ్చిన అనార్కలి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.ఆ తర్వాత 2020లో అయ్యప్పనుమ్ కోషియం సినిమాను రూపొందించారు.సినిమాకు గానూ ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వచ్చింది.
అంతే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభించింది.కాగా ఈ సినిమాకు రీమేక్ గా తెలుగులో భీమ్లా నాయక్ పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఇక సాచి 2020 జూన్ 16వ తేదీన గుండెపోటుకు గురికావడం అనంతరం జూన్ 18న ఆయన తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

కరోనా పరిస్థితి కారణంగా సినీ ప్రముఖులు ఆయన పార్తివదేహాన్ని చూడడానికి కూడా వెళ్లలేక పోయారు.ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినప్పటికీ ఆయన ప్రతిభకు పట్టం కడుతూ ఉత్తమ దర్శకుడిగా కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది.అయ్యప్పనుమ్ కోషియం సినిమాను ప్రజాదారణ చిత్రంగా రూపొందించినందుకు గాను 68వ జాతీయ అవార్డుల్లో సాచికి ఉత్తమ పురస్కారం వరించింది.
ఈ నేపథ్యంలోనే పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.బీజు చేతన్, నంజియమ్మా,అయ్యప్పనుమ్ కోషియం సినిమా యూనిట్ కి నా అభినందనలు.సాచి ఇక నీ గురించి ఏం చెప్పాలి గురువా? మీరు ఏ లోకాన ఉన్న.మీరు చాలా సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను.
ఎందుకంటే మీరంటే ఎనలేని గౌరవం.మీరు చిరకాలం మా మదిలో ఉండిపోతారు అంటూ పృథ్విరాజ్ సుకుమారన్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.







