నాగ చైతన్య హీరోగా రాశి ఖన్నా, మాళవిక నాయర్ మరియు అవికా గౌర్ లు హీరోయిన్స్ గా నటించిన థాంక్యూ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కు మనం దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు.
భారీ అంచనాలున్న ఈ సినిమా కు ఆశించిన స్థాయి లో హైప్ రాలేదు.హైప్ రాకపోవడంతో వసూళ్ల విషయం లో తీవ్ర నిరాశ తప్పలేదు.
హీరో గా నాగ చైతన్య గత చిత్రం లవ్ స్టోరీ మొదటి రోజు దాదాపుగా ఏడు కోట్ల వసూళ్ల ను రాబడితే థాంక్యూ సినిమా మొదటి రోజు కనీసం రెండు కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేక పోయింది.మరీ ఇంత తక్కువ ఓపెనింగ్స్ కు కారణం ఏంటీ అనేది క్లారిటీ లేదు.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 27.5 కోట్ల రూపాయలను వసూళ్లు చేయాల్సి ఉంది.కాని పరిస్థితి చూస్తుంటే కష్టమే అన్నట్లుగా అనిపిస్తుంది.
వీకెండ్ లో కనీసం 10 కోట్ల వరుకు రాబట్టేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మొదటి వీకెండ్ లో కనీసం 15 కోట్ల వరకు రాబడితేనే బ్రేక్ ఈవెన్ కు సాధ్యం అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.అంత వసూళ్లు సాధ్యం కాదు.
కనుక ఇప్పుడు థాంక్యూ సినిమా బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఉండే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.బ్రేక్ ఈవెన్ 27.5 కోట్లు అవ్వడం వల్ల కనీసం 15 కోట్ల లాంగ్ రన్ లో వచ్చినా కూడా థాంక్యూ కు గొప్ప విషయమే అన్నట్లుగా ఓపెనింగ్స్ ఉన్నాయి.మరి నాగ చైతన్య ఏమైనా మ్యాజిక్ చేసి వీకెండ్స్.
వీక్ డేస్ లో మైమరపించి థాంక్యూ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనేది మరో మూడు నాలుగు రోజుల్లో క్లారిటీ వచ్చేను.