బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి మనందరికీ తెలిసిందే.నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఖీ సావంత్, బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
ఇకపోతే కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాఖీ సావంత్ ప్రియుడు అదిల్ దురానితో ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.
సోషల్ మీడియాలో చాలామంది తనని ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారని, అలా ట్రోల్స్ తీయడం ఒకింత తనకు మంచిదే అంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఎందుకంటే జనాలు ట్రోల్స్ చేయకపోతే మేము స్టార్స్ ఎలా అవుతాము.
వాళ్ల పని వాళ్ళని చేయనివ్వండి.మహా అయితే వాళ్ళు తిడతారు, కానీ చంపరు కదా అని తెలిపింది.
ఇక మన గురించి ఎప్పుడు స్వీట్ గానే మాట్లాడితే డయాబెటిక్స్ వస్తుంది.కాబట్టి జీవితంలో అప్పుడప్పుడు చేదు కూడా ఉండాలి అంటూ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది.
అయితే మీరు నన్ను ఎంత మార్చాలి అనుకున్నా నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను.నావల్ల ఎవరు ఇబ్బంది పడటం లేదు.
నేను ఎవరిని హింసించడం లేదు.నిజాయితీగా మసులుకుంటూనే అందర్నీ ఎంటర్టైన్ చేస్తున్న అని తెలిపింది రాఖీ సావంత్.
చాలామంది ఎక్స్పోజింగ్ ఆపి వెళ్లి ఇంట్లో కూర్చో అని సలహాలు ఇస్తూ ఉంటారు.అయితే నేను బాలీవుడ్ లో ఎక్కువగా రోజులు జర్నీ చేయడానికి అలా రెడీ అవుతాను.

అలా పొట్టి బట్టలు చర్మం కనిపించేలా బట్టలు ధరించడం వల్లే నాకంటూ కొంచెం గుర్తింపు వచ్చింది అని తెలిపింది రాఖీ సావంత్.అంతేకాకుండా ఈ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డాను అని ఆమె తెలిపింది.అలాగే ఆమె మాట్లాడుతూ.సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు చేస్తున్నాను.కానీ నా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కేవలం నాకు అత్యాచార సన్నివేశాలు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు.అది నాకు మాత్రం నచ్చడం లేదు.
కేవలం ముద్దు సీన్లు రేప్ సీన్లు మాత్రమే నేను ఎందుకు నటించాలి.నేను కూడా ఒక మంచి డాన్సర్ ని ఇంతకుముందు ఐటమ్ సాంగ్స్ కూడా చేశాను అని తెలిపింది రాఖీ సావంత్.
నిరూపించుకునేందుకు ఒక్క మంచి అవకాశం ఇవ్వండి అలాంటి ఆఫర్ రాకపోవడం వల్లే నేను ఇలా నటించాల్సి వస్తోంది అని తెలిపింది రాఖీసావంత్.







