కేంద్రం విషయంలో ఏపీ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ సానుకూలంగానే ఉంటూ వస్తోంది.అలాగే కేంద్రం కూడా ఏపీ విషయంలో అదే వైఖరిని కనబరుస్తూ, జగన్ ప్రభుత్వానికి అండగా తామున్నామని భరోసా ఇస్తూ వస్తోంది.
ఏపీలో బిజెపి నాయకులు వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్న, కేంద్ర బిజెపి పెద్దలు మంత్రం సందర్భం వచ్చినప్పుడల్లా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ , జగన్ పాలనను మెచ్చుకుంటూ ఉంటారు.ఇక కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతుగా వైసీపీ ఎంపీలు ఓటింగ్ లో పాల్గొంటూ కేంద్రం విషయంలో సానుకూల వైఖరిని కనబరుస్తూ ఉంటారు.
ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వస్తూ ఉండగా, తాజాగా కేంద్రం వైఖరిలో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది.
కొద్దిరోజుల క్రితం కేంద్రం ఏపీ ప్రభుత్వం పై కేంద్రం విమర్శలు చేసింది.
ఏపీ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిందని కేంద్రం ప్రకటించింది.అంతేకాకుండా ఎక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ , తెలంగాణలో ఉన్నట్టుగా ప్రకటించడంతో జాతీయ మీడియాలో కూడా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కథనాలు వెలువడ్డాయి.
ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఇదే విధంగా కేంద్రం విమర్శలు చేసింది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంలో తమ తప్పేమీ లేదని, అంతా రాష్ట్ర ప్రభుత్వమే చూస్తోందని , తగిన ప్రణాలికలు లేకుండా ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కారణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుందని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం వంటివి ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.
కేంద్రం చేసిన ప్రకటనలతో ఏపీ లో వైసిపి ప్రత్యర్థి పార్టీలు ఈ విషయాలను మరింత హైలెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండడంపై వైసిపి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది.కేంద్రం విషయంలో తాము అన్ని విషయాలలోను సానుకూలంగా ఉంటున్నా, ఈ విధమైన ప్రకటనలు చేయడం వెనక ఆంతర్యం ఏమిటి అనేది తెలియక జగన్ సైతం ఆందోళన చెందుతున్నారట.ఇదే విషయంపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ప్రభుత్వ సలహాదారులతో రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు సమాచారం.ఈ సమావేశంలో కేంద్రం వైఖరి లో మార్పు రావడానికి గల కారణాలు ఏమిటి? దీనిపై ఏ విధంగా స్పందించాలి అనే విషయంపై చర్చించినట్లు సమాచారం.కేంద్రంపై ప్రతి విమర్శలు చేసే ముందు అసలు ఏపీ ప్రభుత్వం విషయంలో కేంద్రం వైఖరి మారడానికి గల కారణాలు ఏమిటి అనేది కేంద్ర బీజేపీ పెద్దలను కలిసి, వారితో చర్చించి అప్పుడు ఒక క్లారిటీకి రావాలని జగన్ నిర్ణయించుకున్నారట.ఈ మేరకు త్వరలోనే ఢిల్లీకి వెళ్ళేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.