లైగర్ ట్రైలర్ లో.. ఈ 5 మైనస్ పాయింట్స్ గమనించారా?

విజయ్ దేవరకొండ హీరో గా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన చిత్రం లైగర్.పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది అనే విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సిక్స్ప్యాక్ చేయడం ఇందులో బాక్సర్ మైక్ టైసన్ కనిపించడం అంచనాలు పెంచుతోంది.

 Vijay Devarakonda Liger Trailer Minus Points Details, Vijay Devarakonda, Liger T-TeluguStop.com

ఇటీవల విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది అనే చెప్పాలి.కానీ ట్రైలర్ లో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.సాధారణంగా తెలుగు సినిమా ట్రైలర్ అంటే దాదాపు డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు.పూరి సినిమా అంటే డైలాగ్స్ కోసం ఎదురుచూపులు తప్పకుండా ఉంటాయి కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ లో డైలాగ్స్ కంటే ఎక్కువ పాట వినిపించింది.ఇదొకటి ప్రేక్షకులను నిరాశ పరిచింది.

2.రౌడీ హీరో కి జోడీగా బాలీవుడ్ భామ అనన్య నటిస్తోంది.ఇక ట్రైలర్ లో కాస్త అందంగా కనిపించింది.

కానీ ఎందుకో వీరిద్దరి సీన్లు అనవసరంగా అతికించినట్లు గా కనిపించాయి.మరి పూర్తి సినిమా లో అయినా వీరి కాంబినేషన్ సీన్లు అర్థం వచ్చేలా ఉంటాయో లేదో చూడాలి.

3.ఈ సినిమాకు సంబంధించి అప్పుడెప్పుడో విడుదలైన టీజర్ ఒక్కసారిగా అంచనాలను పెంచింది.ట్రైలర్ కోసం అప్పటి నుంచి ఎదురుచూపులు ప్రారంభమయ్యాయి.కానీ ఇక ఇన్ని రోజులు నిరీక్షణకు ట్రైలర్ సంతృప్తి పరచలేదు అన్న టాక్ కూడా వినిపిస్తోంది.ట్రైలర్.కాస్త కన్ఫ్యూజన్ గానే ఉంది అని అంటున్నారు కొంతమంది.

4.సాధారణంగా ట్రైలర్ లో హైప్ ఇచ్చే సీన్స్ చాలానే ఉంటాయి.కానీ లైగర్ ట్రైలర్లో మాత్రం అలాంటివి చాలా తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.ఇక చివర్లో మైక్ టైసన్ కనిపించేది కూడా బ్రూస్ లీ సినిమా లో చిరంజీవి ఎంట్రీ గుర్తొచ్చేలా ఉంది అన్నది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

5.ఇక లైగర్ ట్రైలర్ చూస్తే అప్పుడెప్పుడో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా షేడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్న టాక్ కూడా వినిపిస్తోంది.ట్రైలర్ లో కథ కొత్తగా కనిపించకపోవడంతో ట్రైలర్ పై నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube