యమహా RX100.అంత తేలిగ్గా యువత ఈ బైక్ ని మర్చిపోలేదు.ఎందుకంటే ఒకప్పుడు కుర్రకారుకి కలల బైక్ ఇది.ఈరోజుల్లో దేశవ్యాప్తంగా మార్కెట్లోకి కొత్త కొత్త ఫీచర్స్‌తో రోజుకో బైక్ విడుదల అవుతున్న విషయం తెలిసినదే.కానీ గత కొన్ని సంవత్సరాలనుండి ‘ఆర్ఎక్స్ 100’ జడమాత్రం తెలియడం లేదు.దాంతో బైక్ లవర్స్ ఆ మోడల్ కోసం కలలు కనే తరుణంలో యమహా కంపెనీ ఓ శుభవార్త తీసుకువచ్చింది.
ఆ బైక్ అంటే యువతకి ఓ కిక్కు.ఎందుకంటే ఆ బైక్ సౌండ్ కోసమైన ప్రతివారు దానిని కొనాలని, ఆ బైక్‌ను నడపాలని అనుకునేవారు.
కొన్ని దశాబ్దాలుగా యువతను అలరించిన ఆర్ఎక్స్ 100 బైక్‌ను కొన్ని సాంకేతిక, 2 స్ట్రోక్ ఇంజిన్ కారణాల వల్ల కొన్ని ఏళ్లపాటు కంపెనీ నిలిపి వేసింది.తాజాగా మళ్లీ ఆర్ఎక్స్ 100ను మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది.
ఈ బైక్‌ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.కానీ, గతంలో ఉన్న 2 స్ట్రోక్ ఇంజిన్ ఇప్పటి ఉద్గారాల ప్రమాణాల నిబంధనల వల్ల ఇవ్వడం కుదరదు అని యమహా మోటార్ ఇండియా విభాగం చైర్మన్ ఇషిన్ చిహానా తాజాగా వెల్లడించారు.
యమహా-ఎస్కార్ట్స్ గ్రూపు భాగస్వామ్యంలో 1985 నుంచి ఉత్పత్తి చేస్తున్న ఈ బైక్‌ను 1996 వరకు కొనసాగించారు.

తరువాతి కాలంలో ఈ ఉత్పత్తి నిలిచిపోయింది.దాంతో యువత ఇతర బైక్‌ల వైపు మళ్లారు.ఆర్ఎక్స్ 100ను జపాన్‌కు చెందిన యమహా కంపెనీ తయారు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ఎంతో స్టయిలిష్ లుక్‌తో ఉండే ఈ బైక్‌ను కాలేజీ కుర్రకారు అమితంగా ఇష్టపడేవారు.మరలా ఇన్నాళ్లకు దాన్ని మార్కెట్లోకి తీసుకురానున్నారు.అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమంటే, సదరు బైక్స్ ఏ తేదీన మార్కెట్లోకి తీసుకువస్తారో స్పష్టంగా తెలపలేదు.కాబట్టి ఇంకొన్ని నెలలు పట్టవచ్చని నిపుణులు అంటున్నారు.