ఏ పేరు చెబితే చంద్రబాబు ఆవేశంతో ఊగిపోతారో… ఏ పేరు చెబితే బాబు లోని అసహనం కట్టలు తెంచుకుంటుందో.ఏ పేరు చెబితే భయాందోళనకు గురవుతారో ఆ పేరే ‘ నాని ‘ .
వైసీపీలో మంత్రులుగా ఉన్న సమయంలోనూ , ఇప్పుడు మాజీ మంత్రులైన కొడాలి నాని ,పేర్ని నాని వంటి వారు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.ముఖ్యంగా గుడివాడ వైసిపి ఎమ్మెల్యే మాజీమంత్రి కొడాలి నాని చంద్రబాబును ఏ స్థాయిలో తిట్టిపోస్తారో అందరికీ తెలిసిందే ఈ నానిలతోనే బాబుకు విసుగు చెందుతుండగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే మరో నాని రెబల్ గా మారుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.
విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోను ఉండేందుకు ఇష్టం లేదు అన్నట్లుగానే ఆయన వ్యవహరిస్తున్నారు. తాజాగా కేసినేని నాని మరోసారి వార్తల్లోకి ఎక్కారు.తన పేరుతో ఎంపీ స్టిక్కర్ ఉన్న కారు ఎవరో అజ్ఞాత వ్యక్తి వాడుతున్నారంటూ ఏపీ, తెలంగాణ పోలీసులకు కేసునేని నాని ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ చేసిన ఏపీ పోలీసులు ఆ ఎంపీ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్న కారు ఆయన తమ్ముడు చిన్నిదేనని తేల్చారు.చాలాకాలంగా కేశినేని నాని చిన్ని మధ్య సఖ్యత లేదు.
ఇద్దరు ఒకరికొకరు అంటి ముట్టున్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.ఇక ఎంపి కేసిన నాని కూడా తెలుగుదేశం పార్టీతోను అదే విధంగా వ్యవహరిస్తున్నారు.

దీంతో కేసినేని నాని రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీ చేస్తారా లేదా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.ఇటీవల చంద్రబాబును నాని కలిసిన సమయంలో తాను టిడిపి ఎంపీని కాదని అందరివాడిని అంటూ మాట్లాడారు.దీంతో ఆయన విషయంలో చంద్రబాబుకు ఒక క్లారిటీ వచ్చేసింది.ఆయనకు ప్రత్యామ్నాయంగా రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు నాని సోదరుడు కేశినేని చిన్ని ని తెరపైకి తీసుకువచ్చారు.
దీంతో చిన్ని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.దీంతో ఇప్పుడు నాని చిన్నిని టార్గెట్ చేసుకున్నారనే విధంగా వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.
కేశినేని నాని పార్టీలో యాక్టివ్ గా ఉండడం లేదు.అలా అని వేరే నేతలను ఇక్కడ ప్రోత్సహించేందుకు ఆయన ఇష్టపడడం లేదు.
దీంతో నాని వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా మారిపోయింది.
.






