పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ విడుదలకు సిద్ధమయింది.ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది.ఇక ఈ సినిమా వచ్చేనెల విడుదల కావడంతో ఈ సినిమా గురించి వరుస అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి.పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయడమే కాకుండా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా లైగర్ సినిమా తెరకెక్కింది.దాదాపు 160 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇక ఈ సినిమా ఏ విధమైనటువంటి ట్రైలర్ కూడా విడుదల చేయకుండానే ఈ సినిమాకు భారీ డిజిటల్ రైట్స్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

సాధారణంగా ఒక సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసేటప్పుడు సినిమా ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత సినిమాపై ఓ అంచనా ఏర్పరచుకొని సినిమాని కొనుగోలు చేస్తారు.కానీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయినా ఏకంగా ఈ సినిమా డిజిటల్ సాటిలైట్ హక్కులను కలిపి ఏకంగా 98 కోట్లకు హాట్ స్టార్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.ఇందులో 65 కోట్ల రూపాయలకు కేవలం డిజిటల్ రైట్ మాత్రమే సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరలకు అమ్మడంతో దాదాపు సినిమాకు పెట్టిన బడ్జెట్ ఈ విధంగా రికవరీ అయినట్టు తెలుస్తోంది.
మొత్తానికి లైగర్ సినిమా నుంచి ఇలాంటి అప్డేట్ విడుదలవుతూ రోజు రోజుకు సినిమాపై భారీ అంచనాలను పెంచుతుందని చెప్పాలి.







