ఈ మధ్య కాలంలో ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి వివాదస్పద విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న శ్రావణ భార్గవి కొన్నిరోజుల క్రితం తన భర్త హేమచంద్రతో విడిపోతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే వైరల్ అయిన వార్తల గురించి శ్రావణ భార్గవి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
తాజాగా అన్నమాచార్య కీర్తన ఒకపరి వయ్యారమే కీర్తిస్తూ శ్రావణ భార్గవి ఒక వీడియోను తన సొంత యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయగా నెగిటివ్ కామెంట్ల వల్ల ఆ వీడియో వైరల్ అయింది.నాలుగు రోజుల్లోనే ఈ వీడియోకు 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఈ మధ్య కాలంలో శ్రావణ భార్గవి యూట్యూబ్ ఛానల్ లో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో ఇదే కావడం గమనార్హం.
అయితే నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తుండటంతో ఈ వివాదంపై శ్రావణ భార్గవి రియాక్ట్ అయ్యారు.

మీకు దృష్టి లోపం ఉంటే నేనేం చేయలేనని శ్రావణ భార్గవి వెల్లడించారు.భక్తి భావంతో ఆ వీడియోను చూస్తే అమ్మవారు కనిపిస్తారని శ్రావణ భార్గవి చెప్పుకొచ్చారు.కానీ మీ చూపులో లోపం ఉందని ఆమె కామెంట్లు చేశారు.
అమ్మాయి నిండుగా దుప్పటి కప్పుకుని ఉన్నా కంటిచూపు సరిగా లేని పక్షంలో అశ్లీలంగానే కనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి తప్పు లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.
నేను పడుకుని వీడియో చేయడంలో తప్పేముందని కనీసం లిప్ సింక్ కూడా కాలేదని ఆమె చెప్పుకొచ్చారు.శ్రావణ భార్గవి కామెంట్ల విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సింగర్ గా శ్రావణ భార్గవికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.శ్రావణ భార్గవి తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.







